పదిగంటలు కూడా నిండని ఆ పసికందు ప్రాణం తీసిన పాపమెవరిది?

0
128

తాజా కబురు జగిత్యాల: కొన్ని సంఘటనలు హృదయాన్ని బరువెక్కిస్తాయి,కొన్ని సంఘటనలు సమాజపు అకృత్యాలను వేలెత్తిచూపె విధంగా చేస్తాయి,ముక్కుపచ్చలారని ఓ పసికందును కర్కసంగా బావిలో పడవేసిన ఘటన ఎందరి మనుసులను ఆవేదనకు గురిచేసింది…జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో తాటిపల్లి శివారులో ఓ వ్యవసాయ బావిలో ఒక్కరోజు క్రితం పుట్టిన పసికందును విసిరేసారు,ఆ బావిచుట్టు కరెంటు మోటర్లు ఉన్నాయి వాటి మద్య ఇరువై నాలుగు గంటల క్రితమె ఈ చూడరాని పాడులోకం చూసిన ఆ పసిబిడ్డను పడవేశారు, వద్దనుకున్నారో, అపహారణకు గురైందో, అక్రమసంభందంతో వదిలేసుకున్నారో, సాకలేక కాదనుకున్నారో తెలియదు కానీ ఈ లోకం పోకడ తెలియని ఆ పసికందు కళ్లు తెరిచి చూసెలోగా శాశ్వతంగా తెరవకుండా చేశారు, బావిలో తేలియాడుతున్న ఆ పసికందును చూసిన ప్రతి హృదయం చలించిపోయింది,గుండె బరువెక్కిపోయింది,పిల్లలకు నోచుకోనివాళ్లు అయ్యె నాకిచ్చినా కళ్లల్లో పెట్టుకొని చూసుకుందునుగా అనుకున్నారు, మరికొందరు మాతృమూర్తులు బిడ్డ లో మరో బిడ్డగా సాకుతుండికదా అనుకున్నారు, కానీ అప్పటికె ఆ శిశువు ఈ లోకం ,ఈ మనుషులు ఇచ్చిన శ్వాసను తీసుకోలేకా నిర్జీవమైంది,బొమ్మలాగా ఆ బావిలో తిరిగింది..అసలు ఆ శిశువును ఎందుకు వద్దనుకున్నారో, ఎవరు బావిలో పడవేశారో తెలుసుకునె పనిలో పోలిసులు విచారణ చేపట్టారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here