పంచాయితీ కార్యదర్శి పై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసిన సి.సి.ఆర్ ప్రతినిధి

0
239

తాజా కబురు జగిత్యాల రూరల్: ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన పౌర మానవ హక్కుల సంస్థ (కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్) ప్రతినిధి ముడారి రాములు 21 జూలై 2020 న సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం మంచిర్యాల జిల్లా పంచాయితీ అధికారి కార్యాలయ పౌర సమాచార అధికారికి 11 అంశాల సమాచారం కోసం రిజిష్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు చేశారు. అట్టి సమాచారం లక్షెట్టిపేట్ మండలం ఎల్లారం గ్రామపంచాయితీకి సంబంధిచినది కావడంతో కోరిన సమాచారం ఇవ్వాలని జిల్లా పంచాయితీ అధికారి కార్యాలయ పౌర సమాచార అధికారి సహచట్టం ప్రకారం దరఖాస్తును ఎల్లారం గ్రామపంచాయితీ కార్యాలయానికి బదిలి చేయగా 23 ఆగష్టు 2020 నాడు రాములుకు ఎల్లారం గ్రామానికి చెందిన ఓ వార్డు సభ్యురాలి భర్త నువ్వు సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన దరఖాస్తు వివరాలను కోరిన సమాచారం గురించి గ్రామ పంచాయితీ కార్యదర్శి మాకు తెలిపినారని ఫోన్ చేసి చెప్పాడని, అలాగే గ్రామ పంచాయితీ కార్యదర్శి కూడా రాములుకి ఫోన్ చేసి ఇప్పటికే ప్రజా ప్రతినిధుల, అధికారుల మధ్య ఒత్తిడితో పనిచేస్తున్నామని అతనితో మాట్లాడినారని సమాచార హక్కు చట్టం-2005 నియమ, నిబంధనలు అనుసరించకుండా తన వ్యక్తి గత వివరాలను గోప్యంగా ఉంచకుండా, కోరిన సమాచారం ఇవ్వకుండా, ఫోన్ నెంబర్ వివరాలు ఇతరులకు తెలుపడం తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేయడమే అని తనకు ప్రాణ భయం ఉందని రక్షణ కల్పించాలని పౌర సమాచార అధికారి అయిన పంచాయితీ కార్యదర్శి పై తగు చర్యలు తీసుకోవాలని శుక్రవారం జగిత్యాల,మంచిర్యాల జిల్లా కలెక్టర్,జిల్లా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సి.సి.ఆర్ ప్రతినిధి రాములు ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here