పంచాయతీ సిబ్బందికి బియ్యం–ప్రధాన మంత్రి సహాయ నిధికి నగదు అందజేసిన ప్రవాస భారతీయుడు

0
199

తాజా కబురు రాయికల్ ప్రతినిధి: మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన   ప్రవాస భారతీయుడు (పేరు తెలుపడానికి ఇష్టపడలేదు) కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో గ్రామ పంచాయతీ  సిబ్బందికి సోమవారం గ్రామ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో  ఒక్కొక్కరికి 25 కేజీల సన్న  బియ్యంను అందించారు.  అలాగే ప్రధాన మంత్రి సహాయ నిధికి 15,000 రూపాయలను ఆన్ లైన్ ద్వారా పంపించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్,సర్పంచ్ సామల్ల లావణ్య వేణు, ఎం.పి.టి.సి సభ్యురాలు రాధ ఆది రెడ్డి ,సింగిల్ విండో అధ్యక్షులు మహిపతి రెడ్డి,ఉప సర్పంచ్ శేఖర్,వార్డు సభ్యులు జేలంధర్,రాజు,రాధ, లక్ష్మీ రాజం, ముతన్న, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయున్ని  గ్రామస్తులు, భా.జ.పా నాయకులు, కార్యకర్తలు అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here