నేడు రాయికల్ లో ఎమ్మెల్యే కార్యక్రమాలు

0
80

తాజా కబురు రాయికల్: పట్టణములో TUFIDC నిధుల ద్వారా 10 లక్షలతో నిర్మించనున్న నాయి బ్రాహ్మణ సంఘ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి అనంతరం TUFIDC నిధులతో 10 లక్షలతో నిర్మించనున్న మేరు సంఘ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి సంఘ ఆవరణలో మొక్కను నాటిన జగిత్యాల శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు,ప్యాక్స్ చైర్మన్ మల్లారెడ్డి,మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజిరెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు కొల శ్రీనివాస్, కార్యదర్శి తలారి రాజేష్,ఉపాధ్యక్షుడు శ్రీనివాస్,స్థానిక కౌన్సిలర్ మ్యాకల కాంతారావు,యూత్ అధ్యక్షులు అనిల్,రామ్మూర్తి,కో ఆప్షన్ సభ్యురాలు వనిత, మాజీ AMC చైర్మన్ ఉదయ శ్రీ,మేరు, నాయి బ్రాహ్మణ సంఘ కార్యవర్గ సభ్యులు,నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని చెర్ల కొండాపూర్ పెద్ద చెరువు ఇటీవలి వర్షాలకు గరిష్ట నీటి మట్టాన్నికి చేరుకోగా పెద్ద చెరువు కట్టను పరిశీలించి ఇరిగేషన్,సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామానికి చెందిన బెల్లాల గంగారెడ్డి అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
ఇటిక్యాల్ గ్రామంలో DMFT నిధుల నుండి 3.68 లక్షలతో నిర్మించనున్న గొనె కాపు రెడ్డి సంఘ భవనానికి భూమి పూజ చేశారు.అనంతరం గ్రామంలో ఇటీవల అనారోగ్యం తో మరణించిన తూము జనార్ధన్, ఇటీవల దుబాయ్ లో మరణించిన తోకల చిన్న నర్సయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here