నేడు గాడిద కి వినతి పత్రం….? పనులు ప్రారంభించకపోతే దున్నపోతుకు వినతి పత్రం ఇస్తాం.

0
312

టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఏమన్నారంటే…
సీఎం కేసీఆర్ రైతులతో మాట్లాడిన ఆడియో ప్రెస్ కు ఎలా లీక్ చేశారు..?
కావాలనే ఆడియో లీక్ చేసి రైతులతో రివ్యూ పెట్టారు.కానీ ఏమైంది..?
రెండు నెలలు కావాల్సి వస్తున్న పనులు ప్రారంభం కాలేదు..?

మేము రాజకీయాలు చేసేందుకు ఇప్పుడు ఎన్నికలు లేవు..
ఇప్పటికైనా కుడి,ఎడమ కాల్వ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం..
నెల రోజుల క్రితం సాగునీటి కోసం సీఎం కేసీఆర్ మేడిపల్లి, కథలాపూర్ మండలాల రైతులతో రివ్యూ మీటింగ్ పెట్టిన కాల్వ పనులు ప్రారంభం కాలేదని గాడిదకు వినతిపత్రం సమర్పించారు టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్.

తాజా కబురు కథలాపూర్-మేడిపెల్లి: జగిత్యాల జిల్లా మేడిపల్లి,కథలాపూర్ మండలాలకు సాగునీరు అందించేందుకు రెండు సంవత్సరాల క్రితం కథలాపూర్ మండలం కలికోటలో సూరమ్మ కాల్వ పనులకు శంకుస్థాపన చేసి రెండేళ్లు గడిచిన పనులు చేపట్టాక పోవడాన్ని నిరసిస్తూ మూడు నెలల క్రితం ఛలో సూరమ్మ ప్రాజెక్టు కు పిలుపునిస్తే నాయకులను,కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. మేము ఆందోళన చేస్తే ఇక్కడి రైతులతో నెలరోజుల క్రితం సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారన్నారు. సీఎం మాట్లాడిన ఆడియో బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కావాలనే ఆడియో ప్రెస్ కు రిలీజ్ చేసి ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టి పనులు ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేసి పనులను ప్రారంభించక పోవడంతో కథలాపూర్ మండలంలోని కలికోట శివార్లలో శనివారం చెరువు వద్ద శంకుస్థాపన చేసిన శిలాఫలకం వద్ద గాడిదకు వినతిపత్రాన్ని సమర్పించి తమ నిరసన వ్యక్తం చేసామన్నారు టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. ఈ కాలువ విషయంలో రాజకీయం చేయడం మాఉద్దేశం కాదని ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవన్నారు. కాల్వ పనులు వచ్చే నెలలో గా ప్రారంభించాలని లేదంటే దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తామని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here