నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ట్రాక్టర్లతో ర్యాలీ తీసిన రైతులు.

0
63
tajakaburu
tajakaburu

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం నుండి రైతుల దండు కదిలింది.కోరుట్ల,మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండలంలోని గ్రామాల నుండి రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ అన్నదాతకు వెన్నుదన్నుగా రైతే రాజయ్యే రోజులు చూడాలనే గొప్ప సంకల్పంతో నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఆధ్వర్యంలో సుమారు1000 ట్రాక్టర్లతో మండలంలోని గండి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడినుండి బయలుదేరి కోరుట్ల సాయి బాబా ఆలయం వరకు రైతులు పెద్దఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ రెవెన్యూ చట్టం ఏర్పాటు పై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టిన అది వందకు వంద వ్యవసాయనికి రైతులకు అనుకూలంగా ఉంటుందని అందుకే రైతులు ట్రాక్టర్లతో వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here