నిరుపేద గిరిజనులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన పాత్రికేయులు

0
154

రాయికల్ రూరల్ తాజా కబురు: ఆకలితో ఉన్నవారికి సహాయం చేసే ఆనందం ప్రపంచంలో మరొకటి లేదని పాత్రికేయులు అన్నారు. మంగళవారం మండలంలోని కైరీ గూడెం గ్రామంలో గల గిరిజన నిరుపేదలకు కరోనా వైరస్ విపత్కర సహాయార్థం పట్టణానికి చెందిన పాత్రికేయులు కడకుంట్ల జగదీశ్వర్, దాతల సహకారంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ కష్టకాలంలో పేదవారికి అండగా ఉండాలని లాక్ డౌన్ సందర్భంగా ఎవరికీ పనిలేకుండా పోయిందని అటువంటి నిరుపేదలను గుర్తించి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రకళ ,ఉపసర్పంచ్ నరేష్, వార్డు సభ్యులు సుజాత, నాయకులు మల్లేశం ,సీనియర్ పాత్రికేయులు ముంజ ధర్మపురి గౌడ్,పాత్రికేయులు ఎద్దండి ముత్యంపు రాజురెడ్డి,వాస౦ లింబాద్రి, అనుపురం లింబాద్రి గౌడ్ , చింతకుంట సాయికుమార్,కనికరపు లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here