నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ.

0
192

రాయికల్ తాజా కబురు: 100 మంది నిరుపేద కుటుంబాలకు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను బుధవారం పట్టణం లోని విశ్వశాంతి హై స్కూల్ ఆవరణంలో పాఠశాల ప్రిన్సిపాల్ మచ్చ గంగాధర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యావత్ ప్రపంచాన్ని రోజు రోజుకు వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరమైన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రతినిత్యం పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవ అభినందనీయమని అన్నారు. వారు చేస్తున్న సేవకు ఎంత చేసినా తక్కువేనని ఇలాంటి విపత్కర సమయంలో తనకున్న దాంట్లో నుండి 9 రకాల నిత్యావసర సరుకులు,మాస్కులను అందజేయడం సంతృప్తిని కలిగించిందన్నారు.అనంతరం ప్రజా ప్రతినిధులు,అధికారులు మాట్లాడుతూ ఇలాంటి ఆపత్కాలంలో గొప్ప మనసు చాటుకుని నేనున్నానని ముందుకు వచ్చి తన వంతు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని కొనియాడారు. నిరుపేదలు,పారిశుధ్య కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి ఆపద్బాంధవుడు లాగానే ఉన్నత స్థితిలో ఉన్నవారు పేదవారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేశ్వర్, ఎంపీడీవో రమేష్, ఎస్సై ఆరోగ్యం, మున్సిపల్ కమిషనర్ డి .శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,మునిసిపల్ వార్డు కౌన్సిలర్లు మ్యాకల అనురాధ, కల్లెడ సునీత, మాజీ సర్పంచ్ మచ్చ నారాయణ, హెల్త్ అసిస్టెంట్ లత, మెప్మా సిబ్బంది శ్రీరాం గౌడ్, మహేష్ మున్సిపల్ సిబ్బంది నారాయణ,కమల్ గౌడ్, రామస్వామి, శ్రీనివాస్, సుదర్శన్, రాజమౌళి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here