ఎవరైనా దాతలు ఆదుకుంటారని ఎదురుచూపులు.
తాజా కబురు మల్లాపూర్ : మల్లాపూర్ మండల కేంద్రంలో ఆవుల నరేష్ (30సం,) చిన్నతనంలోనే తన తండ్రి బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లి అక్కడే గుండె నొప్పితో మరణించాడు. అప్పటి నుంచి తన కుటుంబ భారాన్ని తనే మోస్తూ దుబాయ్ కి వెళ్లి అనారోగ్యాల పాలు అవ్వడం వల్ల సంవత్సరం క్రితం ఇంటికి తిరిగి వచ్చాడు.
తనకు ఇద్దరు ఆడపిల్లలు తారిక (8సం,,) మొక్షిత (3సం,,) భార్య బీడీకార్మికురాలు కాగా అతని తల్లి రోజు కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు.ఆగస్టు 12 రోజున హఠాత్తుగా గుండె నొప్పితో కుటుంబ భారాన్ని మోస్తున్న నరేష్ మరణించడం జరిగింది. ఆ మరణం తో వారి కుటుంబం చీకట్లో కి చేరిపోయింది.వారికి పూట గడవడమే కష్టం అవుతుంది.రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నారు.ఆస్తులు ఏమి లేకపోవడం మరియు గల్పు వెళ్లేందుకు నరేష్ చేసిన ఆరు లక్షల అప్పు ఉండడంతో ఎవరైనా దాతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తమ వంతు ఎంతో కొంత సహాయం చేస్తారని వారు ఎదురుచూస్తున్నారు.
A/C Details:-
ఆవుల సంధ్యా
A/c number: 086810100068126
IFSC ANDB0000868
Andhra Bank , Mallapoor
Contact no & Google Pay and Phone Pay :- 9573763676