
తాజా కబురు కథలాపూర్: మండలంలోని తాండ్రియాల గ్రామానికి చెందిన దేసవేని నర్సు అనే అమ్మది చాలా నిరుపేద కుటుంబం.గ్రామంలోని హోటల్లలో, ఊళ్ళో ఏవైన పండగలు జరిగినప్పుడు భోల్లు తోముకుంటూ, కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. 10 రోజుల క్రితం వర్షానికి ఇల్లు మొత్తం కూలిపోవడంతో ఇంటిముందు ఉన్న చింత చెట్టు కింద వండుకుని తిని అదే చెట్టు కింద నిద్రపోయే పరిస్థితి విషయం తెల్సుకున్న షైన్ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు కాసారపు శేఖర్ గౌడ్ వారికీ ధైర్యం చెప్పి మేమున్నాం అని భరోసా కల్పించి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గు పోసి ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టారు.దాతల సహకారంతో సుమారు ఒక లక్ష రూపాయలతో తాత్కాలిక ఇంటి నిర్మాణానికి సరిపడా వస్తువలను సమకూర్చి, నిర్మాణ బాధ్యతలను స్వయంగా చేపడుతున్న శేఖర్ గౌడ్ ను గ్రామస్తులు అభినందించారు. ఆయనతో పాటు చింతకింది శేఖర్, మరిపెల్లి రమేష్, పంజాల ప్రసాద్, వినోద్, నాగరాజు, శ్రీను, మధు, మహేష్, సుదర్శన్, జగన్ తదితరులు ఉన్నారు.