నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్

0
127

తాజా కబురు జగిత్యాల టౌన్: పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణీ సోమవారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పట్టణంలో గత మూడు రోజుల క్రితం వాణి నగర్ ధర్మ శాల వెనుక ఓ చెట్టు కింద అనారోగ్యంతో మహిళ మృతి చెందగా ఇద్దరు  చిన్నారులను ఆదివారం రాత్రి మున్సిపల్ టౌన్ హాల్ లోని నైట్ షెల్టర్ కు అధికారులు పంపించారు.

సోమవారం  జగిత్యాల బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావణి మృతురాలి భర్త, చిన్నారులను పరామర్శించారు.అలాగే వీరితో పాటు నైట్ షెల్టర్ లో ఉంటున్న పిల్లలకు కావాల్సిన నిత్యావసర వస్తువులను శ్రావణీ అందజేశారు.బాబుకి జ్వరం ఉందని తెలుసుకొని స్థానిక ప్రభుత్వ పిల్లల వైద్యుడిని సంప్రదించి చికిత్స కోసం హాస్పిటల్ కి పంపించారు.చైర్ పర్సన్ వెంట మున్సిపల్ కమిషనర్ జయంత్ రెడ్డి,కౌన్సిలర్ జంబర్తి రాజు, పులి శ్రీధర్, మెప్మా అధికారి రాజయ్య, మున్సిపల్ అధికారులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here