నిజామాబాద్ ప్రధాన రహదారిపై కుంగి కూలిన కల్వర్టు పై రోడ్డు.

0
21

తాజాకబురు : కోరుట్ల పట్టణంలోని కావేరీ గార్డెన్ దగ్గర జాతీయ రహదారిపై అత్యంత ప్రమాదకరంగా కల్వర్ట్ కూలిపోయింది,సంవత్సరం నుండి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు., ప్రస్తుతానికి పోలీస్ బారిగేట్లు పెట్టినా, అత్యంత ప్రమాదకరంగా ఉండడంతో పోలీస్ బారిగేట్లు కూడా నిన్న రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడం తో విరిగిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే రోడ్డు మొత్తం కూలిపోయే అవకాశం ఉంది.రోడ్డు మధ్యలో మూడు మీటర్లు మాత్రం మిగిలింది.

గురువారం రోజున అది కూడా కూలిపోయే అవకాశం ఉంది పలువురు పేర్కొన్నారు.అధికారులు దృష్టి సారించి వేగంగా వచ్చే వాహనాలను 500 మీటర్ల ముందు నుంచి వేగాన్ని తగ్గించడానికి బార్గేట్ పెట్టకపోతే అత్యంత ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆర్అండ్బీ అధికారులు చొరవ తీసుకొని రోడ్డు మధ్యలో కూలిపోయిన కలవాట్లను మరమ్మతులు చేసి వాహనదారులు ఇబ్బందులు కలగకుండా చూడాలని పట్టణ వాసులు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here