రాయికల్ టౌన్ తాజా కబురు: కరోనా విపత్కర సమయంలో వైద్యులు,నర్సులు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందిస్తున్నారని లయన్స్ క్లబ్ అధ్యక్షులు మ్యాకల రమేష్ పేర్కొన్నారు. మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలోని స్టాఫ్ నర్సులను శాలువా తో సన్మానించి మెమెంటో ,శానిటైజర్ లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నివారణకు వైద్యులు ,సిబ్బంది తమ కుటుంబ సభ్యులను వదిలి కరోనా బాధితులకు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు .ఇలాంటి సందర్భాల్లో వైద్యులను,సిబ్బందిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రచన,లయన్స్ క్లబ్ సభ్యులు కాటిపెల్లి రాంరెడ్డి ,దాసరి రామస్వామి ,సిరిపురం గంగాధర్ ,మచ్చ శేఖర్ ,కట్కం కళ్యాణ్ ,బొమ్మకంటి నవీన్ ,స్టాఫ్ నర్సులు రమ్యకృష్ణ ,చెంగలి జ్యోతి,జ్యోతి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .