నడికుడ పంచాయితీ కార్యదర్శికి మెమో జారీ

0
191

బాధితులకు అండగా కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్

తాజా కబురు మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడ గ్రామానికి చెందిన అన్నారపు మల్లవ్వ(65), మగ్గిడి గంగారాం(80), లకు గత 6 నెలలుగా ఆసరా పింఛను రాక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి బాధితులు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్,పౌర మానవ హక్కుల సంస్థను ఆశ్రయించడంతో బాధితుల తరుపున 14 సెప్టెంబర్ 2020 నాడు జిల్లా కలెక్టర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా పంచాయితీ అధికారులకు సి.సి.ఆర్ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నడికుడ పంచాయితీ కార్యదర్శి కి మెమో జారీ చేస్తూ, లబ్ది దారులు జీవించి ఉండగానే మరణించినట్లుగా మండల పరిషత్ కార్యాలయానికి తెలిపినందున సంబంధిత లబ్ధిదారులు గత 5 నెలలపాటుగా పింఛను కోల్పోయినందున పంచాయితీ కార్యదర్శిపై క్రమశిక్షణ చర్యల కోసం సంజాయిషీని 7 రోజుల్లో రాత పూర్వకముగా తెలియజేయాలని లేనిచో క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి పంచాయితీ కార్యదర్శికి మెమో జారీ చేసినట్లు సంస్థ ప్రతినిధులు జలంధర్,చిన్నారెడ్డి, మహేష్, సాయి రాజ్,ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here