ధర్మపురి దేవాలయము ఐదు రోజులు మూసివేత

0
128

ధర్మపురి తాజా కబురు: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణములో రోజు రోజుకు కోవిడ్ -19 (కరోనా వైరస్) కేసుల నమోదు దృష్ట్యా ,గత 2,3 రోజుల నుండి ధర్మపురి పట్టణం,చుట్టు ప్రక్కల గ్రామాలలో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వచ్చినందున. శ్రీ లక్ష్మీ నర్సింహస్వామివారి దేవస్థానములో పనిచేయుచున్న అర్చకులు, సిబ్బందిలో ముఖ్యమైన ఐదుగురికి కూడా కరోనా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినవి. ఈ సందర్భముగా దేవాలయములో విధులు నిర్వర్తించుచున్న ఇతర అర్చక సిబ్బంది భయాందోళనలకు గురి అగుచున్నారు. దేవాలయములో విధులు నిర్వర్తించుచున్న ఇతర అర్చకులు , సిబ్బంది అందరికి టెస్టులు చేయించు విషయములో వైరైస్ వ్యాప్తి చెందకుండా ఉండుటకై ఇట్టి విపత్కర పరిస్థితుల నుండి దేవాలయ అర్చకులు,సిబ్బంది ధరఖాస్తు మేరకు, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఫోన్లో ఇచ్చిన మౌఖిక ఆదేశములు ప్రకారము అర్చకులచే అంతర్గతంగా పూజలు నిర్వహిస్తూ భక్తులకు దర్శనం లేకుండా దేవాలయమును తేది.24-08-2020 నుండి 28-08-2020 వరకు ఐదు రోజులు మూసి వేస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here