దేశ అవసరాల కనుగునంగా గల నూతన జాతీయ విద్యావిధానం-2020 చారిత్రకం

0
201

దేశ అవసరాల కనుగునంగా గల నూతన జాతీయ విద్యావిధానం-2020 చారిత్రకం

చైనీస్ భాషను తొలగించడం సాహసోపేతం…

రాయికల్ తాజా కబురు:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే నూతన జాతీయ విద్యావిధానం ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడం చారిత్రక మని, అభినందనీయమని పేర్కొంటూ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్.యు.పి.పి.టి) జగిత్యాల జిల్లా శాఖ పక్షాన జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేల్పుల స్వామి యాదవ్, చంద సత్యనారాయణ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే దేశం ఒకే విద్యావిధానం, 34 సంవత్సరాల తర్వాత భారతదేశ విద్యలో అద్భుతమైన మార్పులను, భారతీయతను ఆవిష్కరించే నూతన జాతీయ విద్యావిధానం-2020 స్వాగతిస్తున్నామని, ఈ విధానం విద్యార్థుల్లో నైపుణ్యము, అవగాహన, వికాసమే లక్ష్యంగా రూపుదిద్దబడినదని, సైన్స్ లో వెనకబాటును తొలగిస్తుందని, ఆంగ్లంలో ప్రాథమిక విద్య తీవ్ర నష్టాన్ని, పరభాషా విద్యార్థుల్లో అనాసక్తను తొలగిస్తుందని, ప్రాథమిక స్థాయి లో 5 వ తరగతి వరకు మాతృభాష లో బోధన, 6 వ తరగతి నుండే వృత్తి విద్యా అమలు, 10+2+3 కు స్వస్తి పలికి 5+3+3+4 అమలు, మూడేళ్లు రాగానే పిల్లలకు ప్రీస్కూల్, ఏటా పరీక్షలు కాకుండా 3, 5, 8 లోనే పరీక్షలు నిర్వహించడం, బట్టి విధానానికి స్వస్తి పలకడం, లా, వైద్యవిద్య మినహా అన్నింటికి ఒకే రెగ్యులేటరీ వ్వవస్థ వుండడం, వర్తమాన పరిస్థితుల్లో లడ్డాఖ్ లో బార్డర్ లో మన దేశంపై కవ్వింపులకు పాల్పడుతున్న చైనా దేశం యొక్క భాష చైనీస్ భాషను తొలగించడం సాహసోపేతమైనదని, అవసరాల కనుగుణంగా కలిగి,2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యతే లక్యంగా కలిగిన ఈ నూతన జాతీయ విద్యావిధానం-2020 ను రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జగిత్యాల జిల్లా శాఖ స్వాగతిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here