దుష్ప్రచారాలను రైతులు నమ్మే పరిస్థితిలో లేరు

0
80

బిజెపి జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ రావు
.జగిత్యాల తాజా కబురు:కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టం పై రైతులకు ఆదివారం మండలం లోని మోరపల్లి గ్రామంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ రావు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో రైతులు తమ పంటను రవాణా చార్జీలు భరిస్తూ మార్కెట్ యార్డు,కొనుగోలు కేంద్రాల్లో దళారులు నిర్ణయించిన ధరలకే పంటను అమ్మేవాళ్లమని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా తీసుక వచ్చిన చట్టం ద్వారా పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ కొనుగోలు దారుడే రైతు వద్దకు వచ్చి పంటను కొనేలా తెచ్చిన చట్టం వల్ల రైతు లాభపడుతాడనే బిజెపి ప్రభుత్వం చేపట్టిన ప్రతి చర్యనూ విమర్శించడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్, టిఆర్ఎస్ లాంటి పార్టీలు చట్టాలపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని, దుష్ప్రచారాలను రైతులు నమ్మే పరిస్థితిలో లేరని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టం పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు కొక్కుల గణేష్, తిరుపతి,దశరథ రెడ్డి, కొక్కు గంగాధర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here