దళారీ వ్యవస్థను తొలగించి ప్రభుత్వమే మామిడిని కొనుగోలు చేయాలి

0
391

రాయికల్ తాజా కబురు : దళారీ వ్యవస్థను తొలగించి ప్రభుత్వమే మామిడిని కొనుగోలు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు మైతాపూర్ చెర్లకొండాపూర్ ఎంపీటీసీ రాజనాల మధుకుమార్ గృహ నిర్బంధంలో గురువారం 2 గంటల నిరాహార దీక్షను చేపట్టారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మామిడి రైతులకు దళారీలు షాక్ ఇస్తున్నారని, కరోనా లాక్ డౌన్ తో సతమతమవుతున్న మామిడి రైతులను దళారులు విడిచిపట్టడం లేదని, సీజన్‌ ప్రారంభంలో ఎక్కువ మొత్తంలో ధరలు నిర్ణయించి కొనుగోలు చేసిన వ్యాపారులు కీలక తరుణంలో ఒక్కసారిగా రేటును తగ్గించేశారని,మార్కెట్ లో దళారుల దందా యథేచ్ఛగా సాగుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డురంగా ఉందని, లాక్ డౌన్ తో ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనేందుకు రాకపోవడంతో, స్థానిక దళారులు మామిడి రైతులను నిలువునా ముంచుతున్నారని, దీంతో పెట్టుబడి రాక రైతులు అప్పులతో ఇంటికి వెళుతున్న పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

గతంలో జగిత్యాల నుంచి ముంబయికి మామిడి ఎగుమతి అయ్యేది. కానీ, రవాణా నిలిచిపోవడంతో ఎగుమతులకు ఆటంకం కలుగుతోందని,నిరుడు ఇదే సీజన్‌లో క్వింటాలు మామిడి రూ.6 వేల నుంచి రూ.7 వేలు ధర పలికిందని, ఇప్పుడు రూ.3500 పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ నటించడం మాని ప్రభుత్వమే మామిడి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని కోరారు. ఆయనతో పాటుగా గ్రామా భాజపా అధ్యక్షలు దుంపల రాజిరెడ్డి, గంగుల భూమేష్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here