తెలంగాణ లో భాజపా అధికారమే లక్ష్యంగా పనిచేయాలి-జిల్లా అధ్యక్షుడు పి. సత్యనారాయణరావు

0
16

జగిత్యాల తాజా కబురు: భారతీయ జనతా పార్టీ మేడిపల్లి మండల అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భా.జ.పా జిల్లా అధ్యక్షుడు పి. సత్యనారాయణరావు మాట్లాడుతూ 2023లో తెలంగాణ భాజపా అధికార పార్టీ గా లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పై అవగాహన కల్పిస్తూ, నిరుపేదలకు ఉచిత రేషన్ వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని స్థానిక నాయకులకు దిశ నిర్దేశం చేసారు. మండలంలో వివిధ మోర్చా లను నియమించినందుకు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ దశరథ రెడ్డి, కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి పల్లి గోపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఇజ్రాయిల్, యువ మోర్చాజిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి, యువమోర్చా మండల అధ్యక్షుడు గొస్కి మధు, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు మామిడి ధర్మారెడ్డి, నాయకులు కటకం శ్రీనివాస్, సంజీవ్, రజనీష్, ఐటీ సెల్ కన్వీనర్ సాయికుమార్, అజయ్, సాగర్, వినయ్, రఘు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here