తెలంగాణ యాసకు ఆయుస్సు పోసిన” మైవిలేజ్ షో” గంగవ్వ

0
1128

దేశ యూట్యూబ్ సంచ‌ల‌నంగా మారిన గంగ‌వ్వ‌

ఒక‌రి ప్ర‌తిభ‌ను ప‌నిగ‌ట్టుకొని ఇంకెవ‌రో గుర్తించాల్సిన ప‌నిలేదు

తాజా కబురు టెక్నాలజీ డెస్క్ : మారుతున్న కాలంతోపాటు మనుషుల్లో మార్పులు కూడా వస్తుంటాయి, ఒకప్పుడు రేడియో వింటేనె గొప్ప అనుకునె స్తాయి నుండి నెట్టింట్లో ఇంట్లో నుండె సందడి చేసె స్తాయికి సాంకేతికత అంత అభివృద్ధి చెందింది, ఒకప్పుడు ఈ రోజు జగిగిన సంఘటన వార్త మరుసటి రోజు పత్రికలో వచ్చెవరకు ఎంతో ఆతృతగా చూసెవాళ్లం అలాంటిది పెట్టిన మరుక్షణంలోనె ప్రపంచమంత పెట్టినవార్త చక్కర్లు కొడుతుంది, ఇప్పుడి ఇదంతా ఎందుకు అంటె మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అంశం అలాంటిదే, మారుమూల గ్రామంలో వ్యవసాయ కూళీ పనులకు వెళ్లే ఓ వృద్దురాలు ఇప్పుడు యూట్యూబ్ స్టార్ అయింది, అమె నటిస్తున్న సహాజసిద్దమైన నటన, తెలంగాణ యాస, బాషను వ్యక్తికరిస్తు చెప్పె మాటలు ఇతర దేశాల్లో ఉండె భారతీయులు అక్కున చేర్చె విధంగా చేసింది.

ఇది డిజిట‌ల్ యుగం. స‌మాచార ప్ర‌పంచం. ఒక‌రి ప్ర‌తిభ‌ను ప‌నిగ‌ట్టుకొని ఇంకెవ‌రో గుర్తించాల్సిన ప‌నిలేదు. ఒక‌రి మ‌న్న‌న‌ల కోసం, గుర్తింపు కోసం ప్రాథేయ‌పాడాల్సిన అవ‌స‌రం అంత‌క‌న్నా లేదు. సోష‌ల్ మీడియా వేదిక‌లను సోపానాలుగా చేసుకుని మ‌న ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి చాటిచెప్పొచ్చు. మెచ్చిన ప్ర‌తిభ‌కు ప్ర‌పంచ‌మే సాహో అంటుంది. అటువంటి అద్భుత ప్ర‌తిభావంతురాలు మ‌న తెలంగాణ‌కు చెందిన‌ గంగ‌వ్వ మిల్కురి‌.

యూట్యూబ్‌ సంచలనం గంగవ్వ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామం గంగ‌వ్వ‌ది. అచ్చమైన తెలంగాణ భాష, యాస, అమాయకమైన చూపులు, లోకల్‌ పంచ్‌లతో తెలుగు ప్రజలకు దగ్గరైంది. ‘మై విలేజ్‌ షో’ యూట్యూబ్‌ ఛానెల్‌లో గంగవ్వ పాత్రలో ఆమె నటన అద్భుతం. ఈ షోలో ఆమే ఓ స్టార్‌. పల్లెటూరి సంస్కృతిని చాటి చెబుతూ ప్రజాదరణ పొందిన గంగ‌వ్వ‌ సినిమాల్లోకి సైతం రంగం ప్రవేశం చేశారు.

మై విలేజ్ షో ఛానెల్‌ను ఆమె అల్లుడు శ్రీకాంత్ శ్రీరామ్ 2012లో ప్రారంభించాడు. టీం స‌భ్యులు మొత్తం తొమ్మిదిమంది.ఈ బృందం గ్రామ సంస్కృతి, గ్రామీణ కుటుంబ జీవితం గురించి పంచుల‌తో కూడిన‌ హాస్య చిత్రాలను రూపొందిస్తుంది. త‌న జీవిత ప్ర‌యాణం గురించి గంగ‌వ్వ స్పందిస్తూ… శ్రీ‌కాంత్‌ మై విలేజ్ షో ఛానెల్ ప్రారంభించే కంటే ముందు అస‌లు యూట్యూబ్ అంటే ఏమిటో త‌న‌కు తెలియద‌న్నారు. ఊర్లోని చెట్ల‌ను, పుట్ట‌ల‌ను, మొక్క‌ల‌ను వీడియో తీస్తుంటే ఎందుకు ఈ పిల‌గాడు ఇట్ల టైం వేస్ట్ చేసుకుంటుండు అనుకునేదాన్నంది. ఓ రోజు తాను ఆ వీడియోలో న‌టించాల్సి వ‌స్త‌ద‌ని జీవితంలో ఎప్పుడూ అనుకోలేద‌ని తెలిపింది. మొద‌ట్లో అతిథి పాత్ర‌లో మెరిసిన గంగ‌వ్వ 2017 నుంచి పూర్తిస్థాయి యాక్ట‌ర్‌గా మారారు. తాను మాట్లాడే విధానాన్ని ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డుతున్నార‌నుకుంటున్న‌ట్లు గంగ‌వ్వ అంది.

యూట్యూబ్ స్టార్ కాక‌ముందు గంగ‌వ్వ త‌న జీవితం ఏం స‌వ్యంగా లేదంది. ఒక‌టో త‌ర‌గ‌తిలోనే బ‌డి బంద్ చేసిన‌ట్లు తెలిపింది. కుటుంబానికి ఆస‌ర‌గా ఒక‌వైపు పొలం ప‌నులకు వెళ్తూ మ‌రోవైపు బీడీలు చుట్టేద‌న్నానని చెప్పింది. భ‌ర్త తాగుడుకు బానిసైతే కుటుంబ భారాన్నంతా భుజాన మోసిన‌ట్లు తెలిపింది. ఇద్ద‌రు కూతుళ్లు, ఓ కొడుకు బాధ్య‌త‌లు చూసిన‌ట్లు పేర్కొంది. ఎప్పుడైతే మై విలేజ్ షో లో న‌టించ‌డం మొద‌లైందో త‌న జీవితంలో ఎంతో మార్పు చోటుచేసుకున్న‌ట్లు తెలిపింది.

గ్రామీణ జీవితం గురించి వ్యంగ్య కథలను పంచుకోవడం, దీపావళి వేడుకల నుంచి వై-ఫై సమస్యల వరకు మై విలేజ్ స్టోరీ లంబాడిపల్లిపై చర్చనీయాంశమైంది. ఈ ఛానెల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు అతిపెద్ద హిట్ ప్రొగ్రాం డ్రంక్ అండ్ డ్రైవ్. దీనికి 30 మిలియన్లకు పైగా వీక్ష‌ణ‌లు ఉన్నాయి. గంగ‌వ్వ ప్ర‌భావం యూట్యూబ్‌ను మించి విస్త‌రించింది. త‌న సొంత ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌కి 41 వేల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. కెమెరా ముందు ఉండటం త‌న‌కు చాలా ఇష్టం అంది. నటన త‌న‌కు చాలా ఇష్టం అంది. భారతదేశం నలుమూలల ప్రజలు నేను చేసే పనులను చూస్తున్నారని అంశం త‌న‌కెంతో ఆనందాన్ని క‌లిగిస్తుంద‌న్నారు. ఇప్పుడు గ్రామాన్ని సందర్శించే వారు, షో అభిమానులతో త‌న‌తో సెల్ఫీలు తీసుకుంటున్నారంది.

ఛానెల్‌కు ప్ర‌క‌ట‌న‌క‌ర్త‌ల ద్వారా అందుతున్న డ‌బ్బుతో గంగ‌వ్వ‌కు ఓ స్థిర‌మైన ఆదాయం స‌మ‌కూరింది. ఇది ఆమె అప్పులను తిరిగి చెల్లించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. స‌మీప‌ భవిష్యత్తులో తనకోసం ఓ కొత్త ఇల్లు క‌ట్టుకోవాల‌నే ఆలోచ‌న‌లో గంగ‌వ్వ ఉంది. లాభాల‌ను గంగ‌వ్వ‌, శ్రీ‌రామ్ పంచుకుంటారు. ఒక చిన్న ఓపెన్-యాక్సెస్ లైబ్రరీని సైతం ఏర్పాటు చేశారు.

భారతదేశంలో యూట్యూబ్ వీప‌రీతమైన వృద్ధిలో ఉందని, మై విలేజ్ షో ఛానెల్ విస్తృత ప్రజాదరణ పొంది నెలవారీ 265 మిలియన్లకు పైగా యాక్టివ్‌ వినియోగదారులను కలిగి ఉందని యూట్యూబ్ ఆసియా పసిఫిక్ ప్రతినిధి తెలిపారు. ఛానెల్ ప‌ది ల‌క్ష‌ల స‌బ్‌స్రైబ‌ర్ల‌కు రీచ్ కావ‌డంతో 2019లో యూట్యూబ్ బంగారు ప‌త‌కాన్ని అందుకుంది. తెలంగాణ అధికారిక భాష తెలుగు అదేవిధంగా గంగ‌వ్వ స‌హ‌జ సిద్ధంగా మాట్లాడే భాష ఛానెల్ విజ‌యానికి కార‌ణంగా పేర్కొంది. హిందీ, ఇంగ్లీష్‌ను మించి ప్రాంతీయ భాషా ఛానెళ్లకు యూట్యూబ్‌లో ఆద‌ర‌ణ బాగా పెరుగుతుంద‌ని ఆమె వెల్ల‌డించింది.

శ్రీ‌రామ్ స్పందిస్తూ.. కెమెరా ముందు గంగ‌వ్వ ఎంతో స‌హ‌జంగా న‌టిస్తుంద‌ని శ్రీ‌రామ్ అన్నాడు. నిర‌క్ష‌రాస్యురాలైన‌ప్ప‌టికీ ఎంతో చ‌క్క‌గా అర్థం చేసుకుని స‌హ‌జంగా న‌టిస్తుంద‌న్నారు. యూట్యూబ్ ప్రతి ఒక్కరి జీవితాన్ని మారుస్తోందన్నారు. ప్రజలు దీనిని మంచి మార్గంలో ఉపయోగిస్తే ప్రతి ఒక్కరూ స్టార్ అవ్వగలరన్నారు. ప్రతి ఒక్కరూ త‌మ‌ జీవిత సమస్యలను పరిష్కరించుకోవ‌చ్చ‌న్నారు. టెక్నాల‌జీ నిజంగా మన గ్రామ ప్రజల జీవితాలను మారుస్తుందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here