తూ… తూ…. మంత్రంగా గ్రామసభ పెట్టారని పిర్యాదు

0
231

మండలం పంచాయతీ అధికారికి విడిసి తరుపున విజ్ఞప్తి

తూ… తూ…. మంత్రంగా గ్రామసభ పెట్టారని పిర్యాదు

సర్పంచ్ స్థానంలో భర్త చలామణి అవుతుండని ఆరోపణ…

రికార్డులు లేవన్న పంచాయతీ కార్యదర్శి

నిధులు ప్రక్కదారి పడుతున్నాయని అనుమానాలు…?

తాజా కబురు బుగ్గారం:తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ లో సక్రమంగా గ్రామ సభలు, పాలక వర్గ సమావేశాలు జరగడం లేదని, ప్రజలతో తక్షణమే గ్రామసభఏర్పాటు చేయాలని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి శుక్రవారం మండల పంచాయతీ అధికారికి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అధ్యక్షతన ఈ నెల 5న తూ… తూ… మంత్రంగా, అర్ధాంతరంగానే, హడావుడిగా గ్రామ సభ ముగించారని చుక్క గంగారెడ్డి ఆరోపించారు. గ్రామ పారిశుభ్రత, ప్రజా సమస్యలు, ప్రజల ఆరోగ్యం, గ్రామ అభివృద్ధి, గ్రామంలో నిలిచిపోయిన పనుల గురించి, మంజూరైన నిధులు, వాటి సద్వినియోగం పట్ల చర్చించేందుకు ప్రజలు ఈనెల 5న గ్రామ సభకు హాజరు అయ్యారని తెలిపారు. గ్రామ సభకు హాజరైన ప్రజలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, సమస్యల పట్ల చర్చించకుండానే గ్రామ సభను హడావుడిగా, అర్ధాంతరంగా, ఉద్దేశ పూర్వకంగా ముగించారని చుక్క గంగారెడ్డి మండిపడ్డారు.
మండల పంచాయతీ అధికారికి ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో కూడా పేర్కొన్నట్లు ఆయన వివరించారు. సర్పంచ్ మూల సుమలత స్థానంలో ఆమె భర్త మూల శ్రీనివాస్ గౌడ్ చెలామణి అవుతున్నారని తెలిపారు. గ్రామ సభల గురించి, ప్రజా సమస్యల విషయంలో తనతో పాటు గ్రామ ప్రజలు కార్యదర్శితో చర్చిస్తుండగా సర్పంచ్ భర్త మూల శ్రీనివాస్ గౌడ్ మధ్యలో జోక్యం కలిగించుకొని అతి ఉషార్ తనంగా, దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు. ప్రజలు అడిగిన వివరాలకు సమాధానం చెప్పకుండా రికార్డులు తన దగ్గర లేవని, గత కార్యదర్శి ఇప్పటి వరకు ఇవ్వలేదని కార్యదర్శి దాటవేసినట్లు ఆయన పేర్కొన్నారు. పంచాయతీ నిధుల పట్ల, అభివృద్ధి పనులపై ప్రజల్లో ఉన్న అపోహల గురించి గ్రామ సభలో చర్చిస్తా ఉంటే అధికార పార్టీకి చెందిన ఒక గ్రామ స్థాయి నాయకుడు అధికార మదంతో గ్రామ పౌరులపై వాగ్విదాలకు దిగాడని, ఎలాగూ అధికారం చేతిలో ఉందని వీరంతా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రామ పంచాయతీ నిధుల సద్వినియోగంపై, ఇప్పటి వరకు జరిగిన పనులపై, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై, ఈ పాలక వర్గం పై బుగ్గారం గ్రామ ప్రజలు అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని చుక్క గంగారెడ్డి సూచించారు. ప్రజల ఆరోగ్యం, పారిశుద్య పనుల నిర్వహణ, పెండింగ్ పనులు, అభివృద్ధి గురించి, ఇతరత్రా ప్రజా సమస్యల గురించి గ్రామ ప్రజలు మొత్తుకున్నా పంచాయతీ పాలక వర్గం పట్టించుకోవడం లేదన్నారు. బుగ్గారం గ్రామ పంచాయతీ లో నిధులు ప్రక్కదారి పట్టి దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉందన్నారు. ఇప్పటికే భారీ మొత్తంలో నిధులు దుర్వినియోగం/గల్లంతు అయినట్లు అధికార పార్టీ వర్గాలే సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారని చుక్క గంగారెడ్డి తెలిపారు. వర్షా కాలం సీజనల్ వ్యాధులు, కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంగా గ్రామంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రానికి సరైన వసతులు లేక ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని, ప్రజల ఆరోగ్యం పట్ల పాలకులకు చిత్త శుద్ది లేదన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్లనే ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం కూడా పొంచి ఉందని అన్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నూతనంగా ఏర్పడ్డ బుగ్గారం మండల కేంద్రానికి, మండల కార్యాలయాల నిర్మాణాలకు, ఇతరత్రా అభివృద్ధి పనులకు వివిధ రకాల నిధులు మంజూరు చేశారని, ఇంకా కూడా నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బుగ్గారం గ్రామ పంచాయతీ పాలక వర్గం పట్టించుకోక పోవడం వల్లనే ఏండ్ల తరబడి నుండి మంజూరైన నిధుల పనులు జరగడం లేదని,
గ్రామ అభివృద్ధికి, మండల కార్యాలయాల నిర్మాణాలకు రావలసిన నిధులు నిలిచి పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే బుగ్గారం గ్రామ పంచాయతీ పక్షాన ప్రజలతో గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల ఆరోగ్యాలను కాపాడుటకు, మంజూరైన నిధులను సద్వినియోగం చేయుటకు సహకరించాలని బుగ్గారం మండల పంచాయతీ అధికారిని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి కోరారు. దీని ప్రతులు వాఁట్సాఫ్ ద్వారా డివిజనల్ పంచాయతీ అధికారికి, జిల్లా పంచాయతీ అధికారులకు కూడా పంపిస్తున్నట్లు చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here