తాడూరి శ్రీనివాస్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి

0
160

తాజా కబురు రాయికల్: రాయికల్ మండల కేంద్రంలో కుమ్మర సంఘం భవనం లో జగిత్యాల జిల్లా కుమ్మర యూత్ ప్రధాన కార్యదర్శి ,జిల్లా ఎంబీసీ యూత్ నాయకులు గంగాధరి సురేష్ ప్రజాపతి సోమవారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ ప్రజాపతికి ఎమ్మెల్సీ పదవి అవకాశం కల్పించాలని, తెలంగాణ ఉద్యమ సమయంలో అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం లో తనకంటూ గుర్తింపు పొందిన మహానేత ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ గా నియమించారని, రాష్ట్రంలో ఎంబీసీ చైర్మన్ గా రెండోసారి ఎన్నికై అనగారిన కులాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహా నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉందని ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికీ నామినేట్ చేసి చట్ట సభలలో కుమ్మర్లకు చోటు కల్పించాలని జగిత్యాల జిల్లా కుమ్మర యూత్ ప్రధాన కార్యదర్శి, జిల్లాఎంబీసీ యూత్ నాయుడు గంగాధరి సురేష్ ప్రజాపతి అన్నారు. ఈకార్యక్రమంలో రాయికల్ మండల కుమ్మర మండల అధ్యక్షులు కోత్తపల్లి తిరుపతి, యూత్ అధ్యక్షులు గుగ్గిల రమేష్ ,కుమ్మర యూత్ నాయకులు గంగాధరి అశోక్, మామిడి పల్లి రమేష్, కొడిమ్యాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here