తాజా కబురు కథనానికి స్పందన…. నాటు సారా తరలిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు

0
170

జగిత్యాల రూరల్: పల్లేల్లో గుడుంబా జోరు అనే శీర్షికతో శనివారం తాజా కబురులో ప్రచురితమైన కథనానికి స్పందనగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో  ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.  ఆదివారం సారా రవాణా చేస్తున్నారనే సమాచారం తో జగిత్యాల ఎక్సైజ్ సిఐ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున పొలాస గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించగా ఓ వ్యక్తి 20లీటర్ల నాటు సారాను తరలిస్తుండగా ద్విచక్ర వాహనo స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. ఈ తనిఖీలో  ఎక్సైజ్ ఎస్సై నరేష్ రెడ్డి, సిబ్బంది రాజశేఖర్, శ్రీనివాస్, బీర్బల్, మహేష్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here