తాజాకబురు వెబ్ సైట్ ను ప్రారంభించిన ఎమ్మల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు..

0
572

తాజాకబురు వెబ్ సైట్ ను ప్రారంభించిన ఎమ్మల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు..

వెబ్ సైట్ ,లోగోను ఎమ్మల్యేకు అందించిన తాజాకబురు సీఈవో రాజేశ్..

తాజాకబురు వార్త: ప్రతి వార్త ప్రజల పక్షంగా నిస్పక్షపాతంగా ముందుకు తీసుకురావాలని, సమాజం పట్ల అంకితభావంతో ,భాద్యతగా వార్తలను ప్రజలకు చేరవెయ్యాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఎమ్మల్యే క్యాంప్ కార్యాలయంలో తాజాకబురు వెబ్సైట్ ను ఆయన ప్రారంభించారు. ప్రస్తుత సాంకేతిక కాలంలో ప్రతి ఒక్కరు వార్తలను అన్ లైన్ లో చూస్తున్నారని ,తాజాకబురు వెబ్ సైట్, చానల్ మంచి వార్తలను ప్రజలకు అందించాలని  ఆయన అన్నారు. ఈ సందర్బంగా తాజాకబురు సీఈవో కట్కం రాజేశ్ ను ఆయన శుభకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో,యంపిపి తోట నారాయణ, మాదాపూర్ సర్పంచ్ దరిశెట్టి రాజేశం, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్,వెంటాపూర్  సర్పంచ్ తోట శారద లింగారెడ్డి, ,వైద్యులు అనూప్ రావు, సీనియర్  నాయకులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి, పోతాని భూమయ్య, రామస్వామీ గౌడ్,కల్లూర్ సర్పంచ్ వనతడుపుల అంజయ్య అదితరులు పాల్గోన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here