తక్షణం ఫిర్యాదు చేస్తే డబ్బు బదిలీని అడ్డుకోవచ్చు : జిల్లా ఎస్పీ సింధు శర్మ

0
52

జగిత్యాల తాజా కబురు: నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఆన్లైన్, టోల్ ఫ్రీ నంబర్ 155260 ద్వారా సైబర్ నేరాలపై బాధితులు పిర్యాదు చేయవచ్చని,తక్షణం ఫిర్యాదు చేస్తే డబ్బు బదిలీని అడ్డుకోవచ్చని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా లోని ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ కు సంబందించిన దరఖాస్తు స్వీకరించాలని,నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్.సి.ఆర్.పి) ఆన్లైన్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 155260 ద్వారా సైబర్ నేరాలపై బాధితులు పిర్యాదు చేయవచ్చని తెలిపారు. జిల్లాలోని డిఎస్పీ లు,సీఐ లు, ఎస్ హెచ్ ఓ, రైటర్, టెక్ టీం, రిసెప్షన్ లకు, ప్రొబేషనరీ ఎస్సై లకు ఐటీ సెల్ హైదరాబాద్ నిపుణుల ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా లో నమోదు అయిన సైబర్ నేరాలు వాటిపై చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులపై సమీక్షించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ (ఎన్సీ) కె.సురేష్ కుమార్, డిఎస్పీలు వెంకటరమణ, గౌస్ బాబా,ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్, సిఐలు,ఎస్.ఐ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here