డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే

0
28

రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహనీయుడు స్వతంత్ర సమరయోధుడు మరియు గొప్ప సంఘసంస్కర్త వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి భారత పార్లమెంటులో 40 సంవత్సరాల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా,ఉప ప్రధానిగా కూడా పనిచేశారని,పట్టుదల నిండిన ఆత్మ విశ్వాసంతో అడుగులు వేస్తూ తన రాజకీయ జీవితాన్ని ఆదర్శప్రాయంగా కొనసాగించారని, విద్యావేత్తగా మచ్చలేని నిస్వార్ధ నాయకునిగా కరువు కోరల్లో చిక్కిన భారతావని వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవానికి శ్రీకారం చుట్టి భారత ఆహార గిడ్డంగులను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారని, కయ్యానికి కాలు దువ్విన బ్రిటిష్ శత్రువులను మట్టి కరిపించి భారతదేశానికి విజయా న్ని సాధించిన భారత సేనకు మంత్రిగా ధీరోదాత్తతను ప్రదర్శించి, యావత్ భారత ప్రజానీకం గుండె ల్లో నేటికీ సజీవంగా ఉన్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ అడ్మిన్ కుమారస్వామి ఎస్.ఐ పరుశురాం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here