డయల్ 100 కు వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి-జిల్లా ఎస్పీ సింధు శర్మ

0
121

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి.
-అక్రమ కార్యకలాపాల నియంత్రణకు స్పెషల్ డ్రైవ్

జగిత్యాల తాజా కబురు క్రైం: స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో లో జిల్లా ఎస్పీ సింధు శర్మ జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశంను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పోలీస్ ఉన్నతాధికారులతో ప్రగతి భవన్ లో రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారని, అందులో మహిళా రక్షణకు పెద్ద పీట వేయాలని,అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారని దాని ప్రకారం అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.ఇప్పటివరకు నమోదైన కేసులలో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు.నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం ని సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేసుకొని తక్కువ సమయంలో సులభ మార్గంలో నేరాలను ఛేదించాలని అన్నారు.ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణను వేగవంతం చేయాలని,డయల్ 100 కు వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని సూచించారు. రాత్రిపూట పెట్రోలింగ్ సమయం లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను తనిఖీ చేయాలని,దోపిడీ, దొంగతనాలు ఇతర రకాల నేరాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పాటు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో పెండింగ్ లో వున్నా నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేయాలని అన్నారు. వచ్చే నెలలో రాష్ట్ర వర్చువల్ లోక్ అదాలత్ ఉన్నందున రాజీపడి కేసులను లిస్ట్ అవుట్ చేసుకొని, ఎక్కువ కేసులను పరిష్కరించే విధంగా చూడాలని కోరారు. లాంగ్ పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసుల గురించి తెలుసుకొని, డీఎస్పీ లు ప్రతిరోజు మానిటర్ చేసి త్వరగా చేదించాలని సూచించారు. డీఎస్పీ లు వారి వద్ద ఉన్న పెండింగ్ ఓఈలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నేర నియంత్రణ చర్యలలో కీలక పాత్ర పోషించే సి సి కెమెరాల ఏర్పాటులో ప్రజలకు సీసీ కెమెరాల ఉపయోగలపై అవగాహన కలిగిస్తూ ప్రజలను, వ్యాపారులను భాగస్వామ్యులను చేయాలని, జిల్లాలో ఎక్కడెక్కడ సిసి కెమెరాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కెమెరాలు పని చేయు స్థితిలో ఉన్నాయి, ఇంకా ఎన్ని ప్రదేశాల్లో అవసరం ఉన్నాయో పూర్తి వివరాలు సేకరించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, నేర చేదన లో,నేర నియంత్రణ లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అధికారులకు,సిబ్బందికి రివార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

సమావేశానికి హాజరైన పోలీసు అధికారులు

అక్రమ కార్యకలాపాల నియంత్రణకు స్పెషల్ డ్రైవ్: జిల్లా వ్యాప్తంగా అక్రమ కార్యకలాపాలు అయిన ప్రభుత్వ నిషేధిత గుట్కా,ఇసుక అక్రమ రవాణా, పేకాట, పీడీఎస్ రైస్, వ్యభిచారం, గ్యాంబ్లింగ్,కలప అక్రమ రవాణా ను నియంత్రించడo వంటి నియంత్రణకు జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారియొక్క ప్రవృత్తిని మార్చుకోకుండా మరొకసారి ఆ యొక్క చర్యలకు పాల్పడితే వారిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయాలని సూచించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కె. సురేష్ కుమార్, డీఎస్పీ లు వెంకటరమణ, గౌస్ బాబా, ప్రతాప్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,సి.ఐ లు, ఎస్.ఐ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here