టీయూడబ్ల్యూజె 143 (టిజెఎఫ్) ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళి

0
180

రాజన్న సిరిసిల్ల తాజా కబురు:తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల వద్ద అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది. తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు రాచర్ల లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి తీగల మల్లిఖార్జున్ ఆధ్వర్యంలో పాత్రికేయులు నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ జర్నలిస్టులకు హెల్త్ కార్థులు, తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్ట్ అక్రిడేషన్ కార్డులు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డులు అందజేసిన ఘనత వారికి దక్కుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఉపాధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామనాథం, సిరిసిల్ల టీయూడబ్ల్యూజె 143 (టిజెఎఫ్) ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అనంత రెడ్డి ప్రధాన కార్యదర్శి సుద్దాల శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి పర్కాల ప్రవీణ్, బాబు, చెపురి శ్రీనివాస్,కొండమీది సాయి కుమార్, నారోజు శ్రీనివాస్, టి.రాజు,ధర్మగడ్డ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here