టి.వై.యం.ఎస్ఈ.యు రాష్ట్ర అధ్యక్షులు-వేల్పుల స్వామి యాదవ్ వినతి
జగిత్యాల తాజా కబురు: రాష్ట్రంలో దిన దినం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న సందర్భంలో ఒపెన్ పది, ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడానికి అభ్యాసకులు, వారి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం వున్నదని, అభ్యాసకులు ఒపెన్ పది, ఇంటర్ లో అడ్మిషన్ పొంది ట్యూటర్స్ క్లాస్ లకు అటెండ్ కావడం జరిగిందని, వారు ఎంచుకున్న సబ్జెక్టు లలో మొత్తం మూడు ట్యూటర్ మార్క్ డ్ అసైన్మెంట్ల ను సమర్పించాల్సి వుంటుందని, ఇలా జరగని సందర్భంలో పరీక్షలకు అనుమతించబడరని, ఒపెన్ పది, ఇంటర్ అభ్యాసకులకు తరగతులు నిర్వహించిన సమయంలో ఇదివరకే 3 ట్యూటర్ మార్క్ డ్ అసైన్డ్ మెంట్ల లు నిర్వహించడం జరిగినదని, ఈ టి లు ఒక రకంగా చెప్పాలంటే రెగ్యులర్ విద్యార్థులకు ఎఫ్.ఎ. ఇంటర్ నల్ మార్కులతో సమానంగా పరిగణించబడతాయని, కావున కరోనా విజృంభిస్తున్న సందర్భంలో ఒపెన్ పరీక్షలకు హాజరు కావడంపై అభ్యసకుల్లో వారి తల్లిదండ్రులలో అలుముకుంటున్న భయభ్రాంతుల నేపథ్యంలో రాష్ట్రంలో ఒపెన్ పది, ఇంటర్ విద్యార్థుల పరీక్షలు రద్దు చేసి ట్యూటర్ మార్క్ డ్ అసైన్డ్ మెంట్ల మార్కుల ఆధారంగా ఒపెన్ స్కూల్ అభ్యసకులందరిని ఉత్తీర్ణులు గా ప్రకటించి న్యాయం చేయాలని తెలంగాణ యాదవ మహాసభ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షమున ఒపెన్ స్కూల్ రాష్ట్ర డైరెక్టర్ కు వినతి పత్రం పంపినట్లు రాష్ట్ర శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్ తెలిపారు.