జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ముందు బిజెపి నిరసనలు

0
78

తాజా కబురు జగిత్యాల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పిలుపు మేరకు మంగళవారం సారంగపూర్ మండల భాజపా శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా జిల్లా అభివృద్ధి మరియు సమన్వయ కమిటీ సభ్యుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలను ఇబ్బంది పెట్టె LRS ను వెంటనే రద్దు చేయాలని,తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టేందుకు LRS పేరిట జనాలను దోచుకోవాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని, పేద మధ్య తరగతి ప్రజల పై భారం పడ్తునందున LRSను వెంటనే రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ఎలాంటి రుసుము లేకుండా LRS ను అమలు చేయాలని, ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచి పేట్టేందుకే LRS వంటి కొత్త ఆదాయ పథకాలను వెతుకుతున్నారని, ఉద్యమ సమయంలో దళితులకు మూడు ఎకరాల భూమి, అందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తా అని మాయ మాటలు చెప్పి, ఇప్పుడు LRS పేరిట ప్రజల రక్తం తాగే పథకాలు మొదలు పెట్టడం సిగ్గు చేటు అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బద్దెల గంగరాజం, సీనియర్ నాయకులు కలాగిరి మధు, ఆనంతుల స్వామి, మోదిగం మల్లేష్, గంగారెడ్డి,కంచర్ల నరేష్,బాధినేని శేఖర్ మరియు బూత్ అధ్యక్షులు తెలు నరేష్, ఎగ్గే శేఖర్, కంపెళ్లి శేఖర్,పవన్, బి జె వై ఎం మండల అధ్యక్షుడు కంచర్ల శివ, దీటి వెంకటేష్, దీటి రాజు,మానుకా శేఖర్, ఆకుల పొచ్చన్న కార్యకర్తలు పాల్గొన్నారు.

జగిత్యాల లో…
జగిత్యాల మండల శాఖ ఆద్వర్యంలో RDO కార్యాలయం ముందు నిరసన తెలిపి మండల రెవెన్యూ ఆఫీసర్ (MRO) గారికి LRS ని వెంటనే రద్దు చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.LRS పేరుతో కరోనా విపత్తు సమయంలో పేద ప్రజల మెడపై కత్తి పెట్టి డబ్బులు వసూలు చేస్తూ, తెరాస నాయకుల అక్రమ లేఔట్లని సక్రమ లేఔట్లు చేసేందుకే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం LRS స్కీం ని తీసుకువచిందని అందుకే తెలంగాణ నిజం పార్టీ ఐన తెరాసకి వ్యతిరేకంగా వెంటనే LRS స్కీం రద్దు చెయ్యాలని…అలాగే అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు వెంటనే ఇవ్వాలని RDO ఆఫీస్ ముందు నిరసన తెలిపారు.

రాయికల్ లో…
పేద ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసే ఎల్ ఆర్ ఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రాయికల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా బీజేపీ నాయకులు చేసారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అన్నవేణి వేణు మాట్లాడుతూ అక్రమాన్ని సక్రమం చేసుకోమని ప్రభుత్వం అనడం అనేది ప్రజలను దోచుకోవడానికి అని,అసలు ఈ ప్రభుత్వంలో సక్రమంగా ఏం ఉన్నదని ఉన్నదంతా అక్రమమేనని అన్నారు,అధికార ప్రతినిధి మాదన్మోహన్, ప్యాక్స్ ఛైర్మెన్ ముత్యం రెడ్డి మాట్లాడుతూ ఎల్ ఆర్ ఎస్ రద్దు చేసేవరకు ఉద్యమం ఆగదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు ఆకుల మహేష్,రాజనాల మధు, నాయకులు కుర్మా మల్లారెడ్డి,నారాయణ రెడ్డి, ముత్యం రెడ్డి,లక్ష్మినారాయణ,మోహన్ రెడ్డి, ఆశోక్ జి,ధర్మపురి, రామ్ రెడ్డి,రాజశేఖర్ రెడ్డి,శ్రీకాంత్ ,శ్రీకాంత్ రెడ్డి,ch మల్లేశం,మల్లేష్ యాదవ్,ఏనుగు రవి,సంజీవ్,సత్యం,శేఖర్,రవి,శశి,రమేష్ తదితరులు పాల్గొన్నారు

కథలాపూర్ లో…
పేద ప్రజల రక్తాన్ని పీల్చే ప్రయత్నంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన LRS ( G.O No. 131 ) ను రద్దు చేయాలని మరియు పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ఇవ్వాలని కథలపూర్ బిజెపి, BJYM మండల శాఖ ఆధ్వర్యంలో కథలపూర్ బస్ స్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన తెలిపి తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here