జిల్లా లో కేంద్రపథకాల అమలు తీరును సమీక్షించడానికి దిశ కమిటి-జిల్లా కలెక్టర్ జి. రవి

0
141


తాజా కబురు జగిత్యాల:కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు తీరును సమీక్షించడానికి,తగు సలహలు, సూచనలు ఇవ్వడానికి జిల్లా లో దిశ కమిటిని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్  జి. రవి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్బముగా కలెక్టర్ మాట్లాడుతూ దిశ కమిటి ఏర్పాటు చేయడంతో పాటు కమిటి చైర్మన్ గా  కరీంనగర్  పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ వ్యవహరిస్తారని, కో చైర్మన్ లుగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్,   పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత వ్యవహరిస్తారని  తెలిపారు.వీరి ఆద్వర్యంలో తేది 03-09-2020 సమావేశం నిర్వహించడానికి నిర్ణయించడం జరిగిందని తెలిపారు.  ఈ సమావేశానికి జిల్లాలోని 24 శాఖల అధికారులు  వారి ప్రగతి నివేదికలను అందించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు పై సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బి. రాజేషం, జిల్లా పరిషత్ సి‌.ఈ.ఓ శ్రీనివాస్, పి.డి డి.ఆర్డి‌.ఓ  లక్ష్యీనారాయణ, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here