జిల్లా కలెక్టర్ ను కలిసిన నిజామాబాద్ ఎంపీ

0
166

జగిత్యాల తాజా కబురు: జిల్లాలో వరిదాన్యం కోనుగోలు, ఇతర కార్యక్రమాలపై చర్చించుటకు నిజామాబాదు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సోమవారం నాడు కలెక్టరెట్ లో జిల్లా కలెక్టర్ రవి గుగులోత్ ను తన చాంబర్ లో కలిసారు. ఈ సందర్బముగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కోవిడ్-19లో ముందు జాగ్రత్తలు తీసుకొవడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, రైతులను ఇబ్బందులకు గురిచేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. రాజేషం, భాజపా నాయకులు మోరపల్లి సత్యనారాయణ, జెయన్ వెంకట్, భస్వరాజు లక్ష్మినర్సయ్య తదితరులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here