జర్నలిస్టుల పై ఆంక్షలు…? పత్రిక స్వేచ్చకు గొడ్డలి పెట్టు వంటిది..!

0
86
BJP-MADHAN-MOHAN-JGL-

భాజపా జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి చిలుకమర్రి మధన్ మోహన్                              జగిత్యాల తాజా కబురు: జగిత్యాల శాసన సభ్యులు డా. సంజయ్ కుమార్ కొన్ని ప్రభుత్వ పనులైనా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, ప్రగతి పరిశీలన కోసం ఆదివారం వెళ్ళినపుడు పాత్రికేయులపై ఆంక్షలు విధించడం సరికాదని భాజపా జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి చిలుకమర్రి మధన్ మోహన్ సోమవారం అన్నారు. అక్రిడేషన్ కలిగి ఉన్న పాత్రికేయులు మాత్రమే పరిశీలనకు రావాలని, మిగితా పాత్రికేయులు రావద్దని తెలుపడం సరికాదని అక్రిడేషన్ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క ప్రకటనలను జారీ చేయడానికి ఏ ఏ మీడియా లో ఇవ్వడానికి మాత్రమే అని, పత్రిక విలేకరుల విషయం లో అక్రిడేషన్, నాన్ అక్రిడేషన్ అంటూ ఏమి ఉండదని, అక్రిడేషన్ కలిగిన వారే పరిశీలనకు రావలనడం పత్రిక స్వేచ్ఛ పై ఆంక్షలు వింధించినట్లుగానే అవుతుందని, ప్రజా ప్రతినిధులు నామినేషన్ మొదలు కొని మా వార్తలు కవర్ చేయండని గడ్డం పట్టుకొని వేలాడే రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత పాత్రికేయులు మధ్యన వైషమ్యాలు, వర్గాలు సృష్టించడం, క్షద్ర రాజకీయాలు చేయడమే అవుతుందని, ప్రజా ప్రతినిధులు నిర్వహించే, సందర్శించే కార్యక్రమాలకు కేవలం అక్రిడేషన్ ఉన్న పాత్రికేయులు మాత్రమే రావలనడం పత్రిక స్వేచ్చకు గొడ్డలి పెట్టు వంటిదని, ఇలాంటి విధానాలను మార్చుకోవాలని ఆయన ఒక ప్రకటనలో బహిరంగ విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here