జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివి: బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ

0
52

టీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గ సభ్యులకు ఘనంగా సన్మానం

రాజన్న సిరిసిల్ల తాజా కబురు: ప్రజలు,ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలుస్తూ సమస్యల పరిష్కరం కోసం నిస్వార్థంగా పనిచేసే జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివని భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు.మంగళవారం వేములవాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనదన్నారు. వృత్తిని బాధ్యతగా స్వీకరించి ప్రతినిత్యం తమ వార్తా కథనాలతో అన్ని రంగాల ప్రజలకు పాత్రికేయులు దిశానిర్దేశం చేస్తార ని కొనియాడారు.సమాజంలో జరుగుతున్న ఎన్నో చీకటి అవినీతి,అక్రమాలను బయటకు తీసి ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించి ప్రజాధనాన్ని కాపాడటంలో జర్నలిస్టులు కీలకభూమిక పోషిస్తారని పేర్కొన్నారు.సోషల్ మీడియా శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో కూడా పత్రికలు,మీడియా విలువలను ప్రజలు గౌరవిస్తున్నారని తెలిపారు.గతంలో రెండు,మూడు ప్రధాన పత్రికలు తప్ప వేరేవి ఉండేవికావని,నేడు చిన్న మధ్యతరగతి పత్రికలు విశేషంగా వార్తల సేకరణ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నాయని అభివర్ణించారు.జర్నలిస్ట్ గా కొనసాగుతున్న మిత్రులు సమాజంలో జరుగుతున్న కుళ్లు,కుతంత్రాలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రశ్నించే గొంతుకలై ప్రజల పక్షాన నిలబడాలని కోరారు.అనంతరం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా,ప్రధాన కార్యదర్శి పాశం భాస్కర్ రెడ్డి,ఉపాధ్యక్షులు బి మహేష్,రేగుల రాంప్రసాద్,ఎండి రఫీ, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ రసూల్,కోశాధికారి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జి ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ ఆలీ,ప్రచార కార్యదర్శి వేణు,కార్యవర్గ సభ్యులు జిల్లా రమేష్, సిహెచ్ దేవరాజ్, ఎస్ వేణు,బి ప్రవీణ్,బి ప్రదీప్ లతో పాటు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి శ్రీని వాస్ గౌడ్,ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, వేములవాడ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు,నాయ కులు,జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here