జర్నలిస్టుల పట్ల అనుచిత, అసత్యపు, ఆరోపణ పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు

0
101

తాజా కబురు బుగ్గారం: జర్నలిస్టులపై అనుచిత వాఖ్యలు, తప్పుడు, అసత్యపు ఆరోపణలు చేస్తూ వాఁట్సాఫ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుగ్గారం మండల ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో పోలీసులకు పిర్యాదు చేశారు.బుగ్గారం మండల కేంద్రానికి చెందిన బొడ్డు అనిల్, ఎండీ అజీజ్, బిసగోని తిరుపతి గౌడ్ లు మండల పరిషత్ కో – ఆప్షన్ సభ్యుడైన ఎండి అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తి అడ్మిన్ గా ఉన్న బుగ్గారం లెజెండ్ వాట్సాప్ గ్రూపులో విలేఖరుల మనోభావాలను దెబ్బ తీసేవిధంగా, అనుచిత, పోస్టులు చేశారని, అసత్యపు అవినీతి ఆరోపణలు చేస్తూ సమాజంలో అప్రతిష్టను పెంచేలా జర్నలిస్టుల పై పోస్టులు పెట్టారని పిర్యాదు చేశారు. వారు పెట్టిన పోస్టుల వల్ల ప్రజలకు విలేఖరుల పట్ల చులకన భావం ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నదని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవలసిందిగా కోరినట్లు తెలిపారు. బుగ్గారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పైడి మారుతి, ఉపాధ్యక్షుడు మొగిలి సుధన్, పాత్రికేయులు కళ్లెం నగేష్, బుక్క ప్రవీణ్, మసర్తి జీవన్, పల్లెర్ల సురేష్ లు ఏ ఎస్సై రమణా రెడ్డికి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. సమయానికి బుగ్గారం ఎస్సై మంద చిరంజీవి అందుబాటులో లేనికారణంగా, ఎస్సై అనుమతితో ఎఎస్సై రమణారెడ్డికి పిర్యాదు అందజేసినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పైడి మారుతి తెలిపారు. సోషల్ మీడియాలో వారు పెట్టిన పోస్టుల ప్రింట్ కాపీలను కూడా ఆధారాలుగా పోలీసులకు అందజేసినట్లు, ఫోన్ లో చూపించినట్లు అధ్యక్షులు వివరించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here