జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌలభ్యం .. రూ.5 లక్షలు

0
96

జగిత్యాల తాజా కబురు: వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రమాద భీమా సౌలభ్యం రూపాయలు ఐదు లక్షలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జిఓ సంఖ్య 10, తేదీ ఫిబ్రవరి, 3 2021 న ఉత్తర్వులు జారీ చేసిందని జర్నలిస్ట్ యూనియన్ (IJU) జగిత్యాల జిల్లా శాఖ.అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు జె సురేందర్ కుమార్, బండ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఉత్తర్వులలో హోంగార్డులు, రవాణా, రవాణా యేతర ఆటోడ్రైవర్లకు, సైతం భీమా సౌలభ్యం పొందుటకు అర్హత కల్పించారని, తేదీ సెప్టెంబర్ 22, 2020 నుంచి సెప్టెంబర్ 21, 2021 మధ్యకాలంలో ప్రమాద బారిన పడి మృతి చెందిన వర్కింగ్ జర్నలిస్టులు, హోంగార్డులు, ఆటో డ్రైవర్లు, భీమా సౌకర్యం పొందుటకు అర్హులుగా జీవో లో పేర్కొనబడింది. (సాంఘిక భద్రత పథకం లోని చట్టం 2008, కేంద్ర చట్టం 33 ఆఫ్ 2008 ) ప్రభుత్వం మృతి చెందిన కుటుంబానికి బీమా సొమ్ము చెల్లిస్తుందని, తెలంగాణ ప్రభుత్వం 2015 జూన్ 23న జి ఓ ఎం ఎస్ 20 ద్వారా మొదటిసారిగా వర్కింగ్ జర్నలిస్టులకు, హోంగార్డులకు, ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమా పథకం ప్రవేశపెట్టిందని, ప్రతి సంవత్సరం ఈ పథకం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నదని, ఈ పథకంలోని బీమా సొమ్ము మొత్తంలో కేంద్ర ప్రభుత్వం ,రాష్ట్ర ప్రభుత్వం నిధులతో బాధిత కుటుంబానికి రూ 5 లక్షలు బీమా సొమ్మును చెల్లిస్తుంది. వర్కింగ్ జర్నలిస్టులు, సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం ద్వారా,.హోంగార్డులు, డిజిపి కార్యాలయం ద్వారా, ఆటో డ్రైవర్లు, రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం, ద్వారా ప్రభుత్వానికి నిబంధనల మేరకు ఉన్న ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ప్రస్తుతం జారీ చేయబడిన జీవోలో, 2020 సెప్టెంబర్ 22 నుంచి 2021 సెప్టెంబర్ 21 మధ్యకాలంలో ప్రమాద బారినపడి మృతి చెందిన వారు అర్హులుగా జీవో లో పేర్కొనబడిందని వారు తెలిపారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here