జగిత్యాల లో కలకలం రేపిన చిరుత పిల్లేనా… ?

0
129

జగిత్యాల తాజా కబురు: మూడు రోజులుగా ఫారెస్ట్ అధికారులకు చుక్కలు చూపిస్తున్న చిరుత పులి సంచారం నిజంగా చిరుత పులేనా లేకా ఇతర జంతువా అనే అనుమానం ఉండె కానీ ఆ జంతువు పాదాల అచ్చులు,అలాగె దాడి జరిగిన విధానాన్ని చూస్తె అది చిరుత పులే కానీ చిరుత పిల్లా అని నిర్ధారణకు వచ్చారు. జిల్లా కేంద్రంలో యదెచ్చగా తిరుగుతున్న ఆ ప్రాణి మాత్రం అధికారులకు దొరకటం లేదు, మొదటగా జంగ పిల్లి అని‌ బావించిన అధికారులు ఆ తర్వాత చిరుత పిల్ల గా నిర్ధారణ చేశారు, అయితె మొదటగా కృష్ణ నగర్ ప్రాంతంలో కనిపించిన ఆ పులి ఏ వైపు నుండి ఎలా వెళుతుందో ఎవరికి కనిపిస్తుందో ఎవరిపై దాడికి పాల్ఫడుతుందో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వాణి నగర్ లో పది ఇళ్లల్లో పోలీసులు అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు కానీ చిరుత ఆచూకీ లభించలేదు పరిస్థితి తీవ్రం కావడంతో జిల్లా అటవీ శాఖ అధికారి బి వెంకటేశ్వర్లు వరంగల్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా వన్యప్రాణులను పట్టుకుని ప్రత్యేక బృందం జగిత్యాలకు రప్పించారు వాణి నగర్ లో పలు ఇళ్లల్లో అణువణువు గాలించినా చిరుత ఆచూకీ లభించలేదు.పట్టణంలో అటవిశాఖ అధికారులు,పోలిసులు ఇంకా చిరుత కోసం గాలిస్తునే ఉన్నారు, అసలు ఇంత రద్దీగా ఉండె ప్రాంతంలోకి చిరుత ఎలా వచ్చింది, చిరుత పిల్లా తల్లి ఎక్కడ ఉంది అనె కోణంలో విచారణ చేస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here