జగిత్యాల మున్సిపాలిటీ లో 63.56 కోట్ల అంచనా బడ్జెట్,రాయికల్ మున్సిపాలిటీ లో 2.37 కోట్ల అంచనా బడ్జెట్

0
83

15 అగస్టులోగా ఇంటిగ్రెటెడ్ మార్కెట్ ల నిర్మాణాలకు ప్రణాళిక : జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల, తాజా కబురు : రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటిల అభివృద్దిలో బాగంగా ఇంటిగ్రెటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వైకుఠదామాల నిర్మణాలకు శ్రీకారం చుట్టడంతో పాటు ప్రభుత్వం అగస్టు 15 లోగా పూర్తయ్యేలా చర్యలు చెపట్టబోతుందని జిల్లా కలెక్టర్ జి. రవి పేర్కోన్నారు. బుదవారం రాయికల్, జగిత్యాల మున్సిపాలిటీలలో నిర్వహించిన 2021-22 ఆర్ధిక సం. బడ్జెట్ కౌన్సిల్ సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీలలో అన్ని ఆధునిక హంగులతో కూడిన ఇంటిగ్రెటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్, వైకుఠదామాలు, డంపింగ్ యార్డులు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని, నిర్మాణాల కొరకు అవసరమైన స్థలాలను గుర్తించాలని, మున్సిపాలిటిలో స్థలాలు లేనట్లయితే, కోనుగోలు చేయడానికి ఆదేశాలను జారిచేయడం జరిగిందని, కొత్తమున్సిపాలిటిల అభివృద్దికి ప్రజలు, ప్రజాప్రతినిధుల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కోన్నారు. ప్రతి సంవత్సరం కొత్త పురపాలక చట్టం ప్రకారం రాష్ట్ర బడ్జెట్ ప్రకారం మున్సిపల్ పరిదిలో ఒకేరకమైన అభివృద్ది జరిగేవిధంగా మున్సిపల్ చట్టంలో 107 సెక్షన్ ప్రకారం బడ్జెట్ గురించి సవివరంగా వివరించడం జరిగిందని, దానిప్రకారం వచ్చే ఆదాయం, ఖర్చులను ఆదారంగా చేసుకొని ప్రతి మున్సిపాలిటిలలో బడ్జెట్ నిర్వహించడం జరుగుతుందని పేర్కోన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల మున్సిపాలిటీ లో 63.56కోట్ల మరియు రాయికల్ మున్సిపాలిటీ లో 2.37 కోట్ల అంచనా బడ్జెట్ ను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని.మున్సిపాలిటీల ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టం ప్రకారం మున్సిపల్ సిబ్బంది వేతనాలు, పనిముట్లు, వాహనాల నిర్వహణ, విద్యూత్, మంచినీటి బిల్లులు, మున్సిపల్ ఋణాలు, మొదలగు వాటితో పాటు, బడ్జెట్ లో 10% గ్రీన్ బడ్జెట్ లకు మొదటి ప్రాదాన్యతలో చార్జ్ డ్ ఎక్స్పెండెచర్ ను తయారు చేయడం జరుగుతుందని, రూపొందించిన బడ్జెట్లో మిగిలిన నిధుల నుండి 1/3 ఇతర నిధులను కొత్తగా మున్సిపాలిటిలో కలిసిన వార్డుల అభివృద్దికి, మౌళికవసతుల కొరకు కేటాయించడం జరుగుతుందని, వాటితో పాటు మున్సిపాలిటిలో కావలసిన ఇంటిగ్రెటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్, వైకుఠదామాలు, పల్లెప్రకృతి వనాలు, పార్కుల నిర్వహణ మొదలగు వాటి నిర్వహణ కొరకు కావలసిన బడ్జెట్ ను రూపొందించడం జరిగిందని పేర్కోన్నారు. జగిత్యాల జిల్లాలో పట్టణప్రగతి నిధులతో మున్సిపాలిటి అభివృద్దిలో ముందుండేలా సమిష్టిగా కృషిచేద్దామని పేర్కోన్నారు. అన్ని వర్గాలకు ఉపయోగ పడేవిధంగా వైకుఠదామాలు, డంపింగ్ యార్డ్, ఇంటిగ్రెటెడ్ వెజ్ మరియ నాన్ వెజ్ మార్కెట్ నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఆదిశగా జిల్లా యంత్రాంగం కృషిచేస్తుందని పేర్కోన్నారు. జిల్లాలోని 5 మున్సిపాలిటిలలో చట్టం ప్రకారం రూపొందించిన బడ్జెట్ ను అందించడం జరుగుతుందని పేర్కోన్నారు. మున్సిపాలిటీల అభివృద్ది కొరకు అందరు కలిసికట్టుగా పనిచేస్తూన్నారని, కొన్ని ఎరియాలో సిసిరొడ్డు, డ్రైనేజిలు సక్రమంగా లేవని తెలియజేశారని, ప్రధానంగా డ్రైనేజిలు సక్రమంగా లేకపోవడం ఎదురయ్యే సమస్యలను గుర్తించడం జరిగిందని, మొదటి ప్రాదాన్యతగా డ్రైనేజిల నిర్వహణ కొరకు కౌన్సిల్ సమావేశం ద్వారా నిర్ణయం తీసుకొని, అనుమతుల కొరకు పంపించాలని పేర్కోన్నారు.
జగిత్యాల శాసనసభ్యులు డా. యం. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్టముఖ్యమంత్రి కేసిఆర్, మున్సిపల్ శాఖా మాత్యులు కేటిఆర్ లు ప్రత్యేకశ్రద్దతో రాష్ట్రంలోని 141 మున్సిపాలిటిల అభివృద్దికి జనాబా ప్రాతిపధికన రాష్ట్ర నిధులను సమానంగా మంజూరు చేయడం జరిగిందని, జగిత్యాల పట్టణంలో36 కోట్లతో మిషన్ భగీరథ పనులు, 7నుండి 8 కోట్లవ్యవయంతో నూకపెల్లి హౌజింగ్ బోర్డు కాలని పైపు లైన్ కొరకు కేటాయించడం జరిగిందని, దరూర్ క్యాంపులో సంపు నిర్మాణం, సిసిరోడ్లు, వైకుంఠదామాలు, నర్సరిలు మరియు కమ్యూటి హల్ మొదలైనవి ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, పనుల నిర్వహణలొ గుత్తేదార్లు సక్రమంగా పనులు చేస్తూ, ఇబ్బందులకు గురిచేయకుండా పర్యవేక్షించడంతో పాటు, నిర్లక్యంగా వ్యవహరించిన వారైపై ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కోన్నారు. గతంలో పర్యవేక్షణ లోపంతో డ్రైనేజీల నిర్వహణలో ఇబ్బందులకు గురవ్వడం జరిగిందని, కరోనా ఉదృతి తిరిగి విజ్రుంబిస్తున్న తరుణంలో మున్సిపల్ అధికారులు సిద్దంగా ఉండాలని, వారంలో ఒక సారి స్పే చెయించాలని, ప్రజలు మాస్కులు దరించి, సామాజిక దూరం పాటించేలా చూడాలని, అవసరమైన వసతుల కల్పణలో పాలనాధికారులు ముందుంటున్నారని అన్నారు. మున్సిపల్ నిర్వహణలో ప్రభుత్వం నిధులను మంజూరు చేయడంతో ట్రాక్టర్లు, ట్యాంకర్లు కొనుగోలు చేసుకోవడంతో పాటు పచ్చదనంపై ప్రత్యేకశ్రద్ద వహించాలని, నర్సరీలను ఏర్పాటు చేయించడం జరిగిందని పేర్కోన్నారు. ఇళ్లనిర్మాణాలలో కచ్చితంగా ప్రమాణాలు పాటించాలని, నిధులు, నీరు మౌళిక వసతుల కల్పణతో తెలంగాణ అభివృద్ది చెందిందని, భూగర్బజాలాలను పెంచడంలో ప్రత్యేకశ్రద్ద వహించాలని అన్నారు. జగిత్యాల మున్సిపాలిటిలో 33 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందని, పట్టణంలో మౌళికవసతుల కల్పణ సరిగా లేనట్లయితే, అభివృద్ది జరగదని, వెజ్ మరియు నాన్ వెజ్ మార్కేట్ కొరకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పట్టణంలో మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుందని, మాస్టర్ ప్లాన్ తయారిలో రాష్ట్రంలో జగిత్యాల ముందుని అన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ డా. బోగ శ్రావణి, రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, జగిత్యాల మున్సిపల్ కమీషనర్ మారుతిప్రసాద్, రాయికల్ మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, కౌన్సిల్ సభ్యులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here