జగిత్యాల పారిశుధ్య కార్మికుడికి సన్మానం

0
82

జగిత్యాల తాజా కబురు: పారిశుధ్య పనులలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కల్లెడ భీమేశ్ పారిశుధ్య కార్మికుడిని బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ డా. బోగ శ్రావణి శాలువాతో సత్కరించి ప్రత్యేక బహుమతి అందజేశారు. ఈ సందర్బముగా ఆమె మాట్లాడతూ ప్రస్తుత కరోనా కాలములో కార్మికులు ప్రజలలో స్ఫూర్తి నింపుతూ పని చేస్తున్ననారని వారి సేవలను కొనియాడారు. పారిశుధ్య కార్మికులలో ఉత్సహము నింపుతూ పోటితత్వముతో ఉత్తమ సేవలు అందజేయుటలో భాగముగా ప్రతి మాసము ఒక పారిశుధ్య కార్మికుడిని గుర్తించి సత్కరించుటకు నిర్ణయించామని తెలిపారు. అందులో భాగంగానే ప్రస్తుత కరోనా సమయములో ఉత్తమ పారిశుధ్య సేవలు అందించిన భీమేశ్ ను సత్కరించామని అలాగే ప్రజలు అందరు వార్డులలో పారిశుధ్య పనులు నిర్వహించే కార్మికులకు సహకరించలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతి ప్రసాద్,వైస్ చేర్మెన్ గోలి శ్రీనివాస్,వార్డు కౌన్సిలర్లు చుక్క నవీన్, సిరికొండ పద్మ సింగ రావు, బాలే లతా శంకర్, బొడ్ల జగదీష్,కో ఆప్షన్ మెంబర్ శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్లు అశోక్, రాము మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here