జగిత్యాల త్రికుటాలయంలో ఘనంగా రుద్రాభిషేకం- లైవ్ ద్వారా పూజ నిర్వహిచిన మహిళలు

0
178

తాజా కబురు జగిత్యాల టౌన్ :

శ్రీ సుబ్రహ్మణ్య త్రికుటాలయం లో ఘనంగా రుద్రాభిషేకం
ప్రస్తుతం లోకమంతా కరోనా వ్యాధితో బాధపడుతున్న తరుణంలో దాన్ని మరిచిపోయి సర్వమానవాలి సుఖసంతోషాలతో ఉండాలనే సంకల్పంతో కరోనా సంహార రుద్రాభిషేకం కార్యక్రమాన్ని మంగళవారం జగిత్యాలలో ఘనంగా నిర్వహించారు.
జగిత్యాలలో ప్రముఖ పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య పర్యవేక్షణలో మాస శివరాత్రి ని పురస్కరించుకుని పట్టణంలో ని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కొలువై ఉన్న శివునికి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ”పూజ కరోనా సంహారం కై శివునికి ఫల పంచామృతాలతో ఆలయ అర్చకులు తిగుళ్ల విసుశర్మ 3 గంటల పాటు శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం నిర్వహించారు.

ఆలయంలో నిర్వహించిన రుద్రాభిషేకాన్ని లోకల్ చానళ్ల లో ప్రసారం కాగా లాక్ డౌన్ నేపథ్యంలో దేవాలయానికి వెళ్ళడానికి వీలులేకపోవడంతో ఆ కార్యక్రమాన్ని టీవిలో వీక్షిస్తూ ఇండ్లలోనే సుహాసినులు శివుని విగ్రహానికీ పసుపు, కుంకుమ,పూలు, పండ్లతో పూజించి,దూప, దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పల, పంచామృతాలతో శివుడు ని అభిషేకించి కరోనా మహమ్మారి సంహారం కావాలని వేడుకున్నారు.

 లైవ్ ద్వారా పూజ నిర్వహిచిన మహిళలు

ఉదయాన్నే మహిళలు తలంటూస్నానాలాచరించి నిత్యపూజాకార్యక్రమాలు నిర్వహించి , టీవిల ముందు పూజా ద్రవ్యాలతో పాటు శివుని విగ్రహం పెట్టుకుని ఆలయంలో అర్చకులు తిగుళ్ల విసుశర్మ నిర్వహిస్తున్న మాదిరిగా ఆయనను అనుసరిస్తూ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

జగిత్యాల పట్టణం లోని ఈ కార్యక్రమానికి మహిళలచే అనూహ్య స్పందన లభించగా ఇందులో తాటిపర్తి రోహితా రెడ్డి, లావణ్య, మంజుల, శైలజ, లత, విజయ, లక్ష్మి లతో పాటూ పెద్ద సంఖ్యలో మహిళలు ఇండ్లలో అభిషేకం నిర్వహించారు.ఈశ్వరుని దయవల్ల కరోనా వైరస్ అంతరించి పోయీ లోకం సుభిక్షంగా ఉండాలని రుద్రాభిషేకం ద్వారా గరళ కంఠుడిని సుహాసినులు ప్రార్థించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here