జగిత్యాల జిల్లా ప్రజల్లారా “జరపైలం” కరోనా మహామ్మారి పొంచి ఉంది 

0
362

జగిత్యాల జిల్లా ప్రజల్లారా “జరపైలం” కరోనా మహామ్మారి పొంచి ఉంది

తక్కళ్లపల్లి వృద్దుడికి కరోనాతో మరోసారి కలకలం

చికిత్సచేసిన ప్రైవేటుఆసుపత్రి సీజ్

డాక్టర్ తోపాటు ఒకరు హోంక్వారంటైన్

మరో నలుగురు ప్రభుత్వ క్వారంటైన్ కి తరలించిన అధికారులు

ఇళ్ళనుంచి బయటకు రావద్దని తక్కళ్ళపల్లి వాసులకు ఆంక్షలు

బృందాలుగా వైద్యసిబ్బంది తనిఖీలు

జగిత్యాల తాజా కబురు: జగిత్యాల జిల్లాలో 69 సంవత్సరాల వృద్దుడికీ కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు, అధికారయంత్రాంగం మరొక్కసారి ఉలిక్కిపడింది.

ఆదివారం మల్యాల మండలం తక్కళ్ళపల్లి కీ చెందిన వృద్దుడికి కరోనా సోకగా అధికారులు అప్రమత్తమైన
జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్, సిబ్బంది, డిఎస్పి వెంకట రమణ, మల్యాల సిఐ కోరె కిషోర్ తో పాటు పోలీసు సిబ్బంది ఆగ్రామానికి చేరుకుని రోగికి సంబంధించిన అన్ని వివరాలసేకరణలో నిమగ్నమై రోగి బంధువులు, రోగిని జగిత్యాల, కరీంనగర్ ఆసుపత్రులకు తరలించిన ఆటో డ్రైవర్ తోపాటు నలుగురినీ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో చేర్పించారు.

అలాగే ఆవృద్దుడీకి చికిత్స చేసిన జగిత్యాలలోని ఓప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడు, ఆసుపత్రి సిబ్బంది ఒకరిని హోం క్వారంటైన్ లో ఉంచారు.

రోగి గ్రామంలో, బందువుల్లో ఎవరెవరిని కలిశారో ఆరాతీస్తున్నారు.

తక్కళ్ళపల్లి గ్రామంలో పోలీసు చెక్ పోస్టు ఏర్పాటు చేసి ఎస్సై స్థాయి అధికారి తోపాటుప పోలీసులు తనిఖీలు చేపట్టారు.

గ్రామంలోకి చుట్టుపక్కన ఉన్న లంబాడి పెల్లి, మ్యాడంపల్లి, మానాల, దోమలకుంట గ్రామాలకు ఎవరు వెళ్లకుండా,రాకుండా వెళ్ళకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు

వైద్య సిబ్బంది బృందాలుగా ఏర్పడి గ్రామంలో ఇళ్ళిళ్ళు తిరిగి పరీక్షలు చేస్తున్నారు.

గ్రామంలో ఇళ్లనుంచి ఎవరు బయిటకు రావద్దని నిషేధాజ్ఞలు విధించారు. ఐలొగే అందరూ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.

వరి కోతలు నేపథ్యంలో ఇళ్లు నుంచి బయటకు వెళ్లకపోతే పంటలను ఎలా కాపాడుకుంటామని, ప్రకృతి కన్నెర్ర చేస్తున్నదని అకాల వర్షాలు పడితే నష్టం వాటిల్లుతుందని, గ్రామం పరిధిలో రైతులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.

వృద్ధుడిని కరోనా సోకినట్లు తెలియగానే , మరెంతకాలం లాక్ డౌన్ కొనసాగుతుందోనని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కరోనా వైరస్ వ్యాది ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమయాన జగిత్యాల జిల్లా లో 3 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారు క్వారంటైన్ లో చికిత్స పొంది వారం రోజుల క్రితం నెగెటివ్ రాగా వారిని అధికారులు డిశ్చార్జ్ చేయగా ఈ జిల్లా ఆరెంజ్ జోన్ లో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

జిల్లాలోని కోరుట్ల టౌన్, కోరుట్ల మండలం కల్లూరు, జగిత్యాల మండలం వంజరిపల్లి కి చెందినఐదేళ్ళ బాలుడితో కలిపి ముగ్గురు కరోనా బారిన పడి చికిత్సతో వ్యాధి నుంచీ బయటపడగా అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకుంటూ ప్రభుత్వ సడలింపులతో కొంత ఉపశమనం లభిస్తుందన్న ఆశలకు ఆదివారం మల్యాల మండలం తక్కళ్ళపల్లి కి చెందిన 69ఏళ్ల వృద్దుడికి కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా మరొక్కసారి ఉలిక్కిపడింది.

రాష్ట్ర కేబినెట్ సమావేశం కరోనా గూర్చి మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగనుండగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల లో ఏయే సడలింపులివ్వాలనీ దానిపై స్పష్టత ఇవ్వనున్న గా జగిత్యాల జిల్లాకు సడలింపులుంటాయని ఊహించగా మరో కేసు నమోదు కాగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మల్యాల మండలం తక్కలపల్లి చెందిన వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతూ గ్రామంలోనే ఉంటున్నాడని గతనెల 23నాడు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో జగిత్యాల లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో టెస్ట్ చేయుచుకోగా , ఆరోజు కొద్ది మంది ఆస్పత్రిలో టెస్ట్ చేయించుకున్ళట్లు తెలిసింది

అయితే ఆ డాక్టర్ కరీంనగర్ లో స్కానింగ్ తీసుకోవాలని చెప్పడంతో అతను 23 నాడు తక్కలపెళ్లి కి వచ్చి మరుసటిరోజు కరీంనగర్ లో డైగ్నాస్టిక్ లో స్కానింగ్ తీసుకొని మళ్ళీ ఆటోలో తక్కలపెళ్లి వచ్చినట్లు సమాచారం

మార్చి 25 న మరోసారి జగిత్యాల లో డాక్టర్ కు చూపింథగా సదరు వైద్యుడు కరీంనగర్ హాస్పిటల్ కి పంపడంతో అతను మళ్లి ఇంటికి వచ్చి 26 ఆదివారం కావడంతో 27 నాడు కరీంనగర్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరి ఈనెల ఒకటీ వరకు ఉండగా 1నాడు మధ్యాహ్నం హైదరాబాద్ లోని నిమ్స్ లో చేరినట్లు తెలుస్తోంది.

ఈనెల 2వ తేదీ నాడు సాయంత్రం సీరియస్ ఉండడంతో ఉస్మానియా హాస్పిటల్ కి షిప్ట్ చేసిన కుటుంబ సభ్యులు అక్కడ జాయిన్ చేసుకోక పోవడంతో గాంధీ హాస్పిటల్ కి తరలించారు

2నాడు రోగి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేయగా 3నాడు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలగా జిల్లా మరోసారి కలకలం రేపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here