జగిత్యాల జిల్లా పట్టణంలో శివవీధి లో విషాదం., దంపతుల ఆత్మహత్య.

0
37

జగిత్యాల జిల్లా పట్టణంలో శివవీధి లో విషాదం., దంపతుల ఆత్మహత్య.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివవీధిలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న రాత్రి చోటుచేసుకుంది., ఈ ఘటన తో బంధువులు, మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు., పట్టణంలోని శివవీధి కి చెందిన గంజి రాంబాబు (49), లావణ్య(47) అనే దంపతులు గత 10 సం. రాలుగా ముంబాయిలో నివాసం ఉంటూ ఓ యాడ్ ఏజెన్సీలో పని చేస్తున్నారు., అయితే రాంబాబు తండ్రి రాజేశం ఎనిమిది నెలల క్రింతం ఆనారోగ్యంతో మృతిచెందారు. తండ్రి మృతి చెందడంతో రాంబాబు దంపతులు జగిత్యాలకు వచ్చి లాక్ డౌన్ రావడంతో జగిత్యాలలో తమ నివాసంలో ఉంటున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం దంపతులకు కరోనా పాసిటివ్ వచ్చిందని అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారని స్థానికుల సమాచారం., దంపతులు గురువారం తమ ఇంటిలో ఫ్యాన్స్ కు ఇద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డారు., అయితే వీరికి వివాహమై 25 సంవత్సరాల గడుస్తున్నా సంతానము కూడా కలుగలేదు., దంపతుల ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సివుంది., పట్టణ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here