జగిత్యాల జిల్లాలో హై టెన్షన్ ఈ రోజు ఒక్కరోజె ఎనిమిది కరోనా పాజిటివ్,అన్నీ ముంబాయి వలస కార్మికుల నుండి వచ్చినవె..యదెచ్చగా బయట తిరుగుతున్న వలస కార్మికులు..

0
1389

జగిత్యాల జిల్లాలో హై టెన్షన్ ఈ రోజు ఒక్కరోజె ఎనిమిది కరోనా పాజిటివ్,అన్నీ ముంబాయి వలస కార్మికుల నుండి వచ్చినవె..యదెచ్చగా బయట తిరుగుతున్న వలస కార్మికులు..

 

తాజకబురు న్యూస్ ప్రతినిధి జగిత్యాల: జగిత్యాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి, ముంబాయ్ నుండి స్వగ్రామాలకు వచ్చిన వారికి కరోనా పాజిటివ్ లు నమోదు కావటంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది,కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సడలింపు ఇవ్వటంతో గత కొంతకాలంగా ముంబాయ్, ఢిల్లీ, మహరాష్ర్ట, ఇతర రాష్ర్టాల్లో ఉన్న స్తానికులు రైళ్లు, బసుల్లో తమ స్వగ్రామానికి చేరుకున్నారు, అయితె రాష్ర్టానికి వచ్చినప్పుడు పలు చెక్పోస్టుల్లో వైద్య అధికారులు పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు ఉన్నవారిని ఐసోలేషన్ కు తరలించింది, అలాగె మిగితవాళ్లను హోం క్వారంటైం లో ఉండాలని చెప్పింది, అయితె కొందరు వలస కార్మికులు జాతీయరహాదారి కాకుండా ఇతర ప్రాంతాలగుండా అర్థరాత్రి వేళల్లో తమ గ్రామాలకు చేరుకొని బయట యదెచ్చగా తిరుగుతున్నారు, అలాగె ప్రభుత్వ అధికారులు అక్కడినుండి వచ్చిన వాళ్లను హొం క్వారెంటైన్ లో ఉండాలని సూచించిన బేఖాతరు చేస్తు బయట తిరుగుతున్నారు, అలా జిల్లాలో రోజురోజుకు పాజిటివ్ ల సంఖ్య పెరుగుతుంది, తాజా లెక్కల ప్రకారం జిల్లాలో ఈ రోజు నమోదైన పాజిటివ్ కేసులు ఎనిమిది,  జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణనగర్ కు చెందిన ఒకరికి, గొల్లపల్లి మండలం చందోలి గ్రామానికి చెందిన ముగ్గురు, బుగ్గారం మండలానికి చెందిన ఇద్దరికి,కోరుట్ల పట్టణం భీముని దుబ్బకు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ నమోదు కాగ మొత్తంగా చూసుకున్నట్లైతె  జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 19 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, అందులో  ఇప్పటివరకు ముగ్గురు డిశ్చార్జ్ కాగా, 16 మంది చికిత్స పొందుతున్నారు..అధికారులు కఠినమైన చర్యలు తీసుకోకపోతె మరిన్నీ పాజిటివ్ కేసులు పెరిగె అవకాశం ఉందని తెలుస్తుంది..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here