జగిత్యాల జిల్లాలో ’’ కరోనా’’ విలయతాండవం,భయం గుప్పిట్లో జిల్లా వాసులు పెరుగుతున్న మరణాల సంఖ్య,ఆందోళనలో ప్రజలు…

0
189
tajakaburu
tajakaburu

తాజాకబురు జగిత్యాల :కరోనా తల విలయతాండవం చూపిస్తుంది రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తే ప్రజల  గుండె దడేల్ “మంటుంది” జిల్లావ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు అధికంగా పెరిగాయి, ఒక్కరోజులో వందల కేసులు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు..

జగిత్యాల జిల్లాలో గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుంది రోజురోజుకు అధికంగా నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది, అంతకంత రెట్టింపు పాజిటివ్ సంఖ్య పెరుగుతూనే ఉంది దీంతో అప్రమత్తమైన వైద్య అధికారులు ప్రతి పీహెచ్సీలో పరీక్షలు నిర్వహిస్తున్నారు…

జిల్లా వ్యాప్తంగా ఎందుకు ఇంతలా కేసులు నమోదవుతున్నాయి?

ఎప్పుడూ లేనంతగా జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది అయితే గతంతో పోలిస్తే పార్టీల సంఖ్య అధికంగా ఉండటం పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు మహారాష్ట్ర నుండి ఎక్కువ సంబంధాలు కలిగిన కోరుట్ల మెట్పల్లి ప్రాంతాల ప్రజలకు సెకండ్ వే పెరగడానికి కారణం అవుతుందని కొందరు అంటుంటే గత పది రోజుల క్రితం జాతరలో సుమారు 60 వేల మంది పాల్గొనడంతో వైరస్ వ్యాప్తి అధికంగా వచ్చిందని అంటున్నారు ఏది ఏమైనా కోరుట్ల నియోజకవర్గంలో అత్యధికంగా కేసులు నమోదు కావడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి దాంతోపాటు మరణాల సంఖ్య కూడా అధికంగా ఉండడంతో ప్రజలు భయపడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం మాస్కు ధరించాలి అంటూ ఓ పక్క చెబుతున్నప్పటికీ ప్రజల్లో ఇప్పటివరకు అవగాహన లేకపోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు…

లాక్ డౌన్ విధిస్తారా?

కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మెట్పల్లి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండలాల్లో కేసుల సంఖ్య అధికంగా పెరుగుతుండడంతో కోరుట్ల మెట్పల్లి మున్సిపల్ పరిధి కావడంతో దాంతోపాటు వ్యాపార వాణిజ్య దుకాణాలు అధికంగా ఉండడంతో కేసులు అధికంగా పెరుగుతున్నాయి దీనికి అనుగుణంగా పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకొని స్థానిక రాజకీయ నాయకులు అధికారులతో చర్చించి రానున్న రెండు మూడు రోజుల్లో రెండు మునిసిపాలిటీల్లో లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఒకవేళ లాక్ డౌన్ విధిస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు అవుతుంది లేకపోతే వైరస్ వ్యాప్తి అధికంగా అవుతుందని వైద్య సిబ్బంది తెలుపుతున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here