జగిత్యాలలో రైతన్నల నిరసన … ముత్యంపేట చెక్కర ఫ్యాక్టరీ తెరిపించేదెన్నడు …. ?

0
105
Raithula nirasana tajakaburu

జగిత్యాల తాజా కబురు:మల్లాపూర్ మండలం ముత్యంపేట చెక్కర ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని కోరుతూ రైతు ఐక్య వేదిక ఛలో కలెక్టరెట్ నిరసనకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఆదివారం రాత్రి నుండి జిల్లా లోని పలు మండలాల రైతు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అయినప్పటికీ సోమవారం జిల్లా నలుమూలాల నుంచి జగిత్యాల పాత బస్టాండు నుండి ర్యాలీగా కలెక్టరెట్‌కు చేరుకున్న రైతులు సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై బైటయించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరెట్ కార్యాలయ ఉద్యోగికి వినతి పత్రం అందజేశారు. కాగా రైతుల నిరసన, ధర్నా నేపథ్యంలో కలెక్టరెట్ చుట్టూ భారీగా పోలీసులు మొహరించారు.అంతకుముందు రైతులు ఛత్తీస్‌గడ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన పోలీసుల ఆత్మశాంతికై కొద్దిసేపు మౌనం పాటించారు.

raitula nirasana tajakaburu                ఈ సందర్భంగా నిరసన, ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగిత్యాల జిల్లాలోని ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అయిన ముత్యంపేట నిజం షుగర్ ఫ్యాక్టరీ ని వంద రోజుల్లో తెరిపిస్తామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఆ ఊసే ఎత్తకుండా తప్పించుకునే ధోరణిని అవలంభిస్తున్నారని ఆరోపించారు. చెరుకు రైతులు ఎన్ని రకాలుగా నిరసన కార్యక్రమాలు, ఉద్యమాలను చేసినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరమైన విషయమని, 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూతపడ్డ ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ‌వాగ్దానం చేసి 7 సంవత్సరాలు కావస్తున్నాప్పటికీ ఆ హామీని నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి , చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి , తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి శేర్ నర్సారెడ్డి , జిల్లా రైతు ఐక్యవేదిక లీగల్ సెల్ కన్వీనర్ బద్దం శ్రీనివాస్ రెడ్డి , జిల్లా కిసాన్ కాంగ్రెస్ సెల్ అధ్యక్షులు వాకిటి సత్యం రెడ్డి , సి.డి.సి మాజీ చైర్మన్ కంది బుచ్చిరెడ్డి, రైతు ఐక్యవేదిక నాయకులు గురిజాల రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వేముల విక్రమ్రెడ్డి,ఏనుగు రమేష్ రెడ్డి,ఎండబెట్ల వరుణ్ కుమార్,బోత్కూరి లింగారెడ్డి రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here