జగిత్యాలలో పారిశ్యుద్ధ్య పనులను మెరుగుపర్చాలి

0
43

అధికారులతో సమీక్షించిన మున్సిపల్ ఛైర్పర్సన్ Dr. శ్రావణి

జగిత్యాల తాజా కబురు: పట్టణంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పారిశుద్ధ్య పనులను మెరుగుపర్చాలని జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ శ్రావణి అధికారులకు సూచించారు. శనివారం జగిత్యాల పురపాలక సంఘం కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగంపై ఆమె అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె శ్రావణి మాట్లాడుతూ నూతనంగా అమలుపరిచిన పిన్ పాయింట్ ప్రోగ్రాం ఎలా జరుగుతుందని అధికారులను ప్రశ్నించారు. ఇళ్లలో నుండి చెత్త సేకరణ తడి, పొడి చెత్త వేరు వేరుగా తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రానున్న హోలీ, ఉగాది, రంజాన్ మాసం పండుగలను పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలో పారిశుద్ధ్య పనులను మెరుగుపర్చాలన్నారు. డ్రైనేజీలన్ని శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైడ్ మిశ్రమంతో పట్టణమంతా పిచికారి చేయాలన్నారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఛైర్పర్సన్ శ్రావణి అధికారులకు సూచించారు.పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులపై ఆమె ఆరతీశారు.సమీక్ష సమావేశంలో కమిషనర్ మారుతి ప్రసాద్, సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, రాము, జవాన్లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here