జగిత్యాలలో ఘనంగా రెడ్డి బతుకమ్మ ఆట

0
82

జగిత్యాల తాజా కబురు:తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రెడ్డి ఆడపడుచులు పాటలు పాడుతూ బతుకమ్మ వేడుకలను జగిత్యాలలో ఘనంగా నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ రెడ్డి ఆడపడుచులచే రెడ్డి జనసంక్షేమ సంఘం, రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో రెడ్డి పంక్షన్ హాళ్లో ఆదివారం ‌బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఆడపడుచులు వివిధ రకాల పూలు తెచ్చీ అందంగా బతుకమ్మను పేర్చి వలయాకారంగా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే విధంగా పాటలు పాడుతూ వేడుకలు ఘనంగా జరిపారు.మహిళలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తు బతుకమ్మ ‌వేడుకలను జరుపుకున్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాటి పర్తి విజయలక్ష్మి, రెడ్డి జేఏసీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, రెడ్డి జేఏసీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగిరెడ్డి రజిత, బతికేపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి, జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ గడ్డం లత, ఎడ్మల వరలక్ష్మి, కుర్మ ప్రేమలత, నాగిరెడ్డి భారతి, తాటి పర్తి రోహితా,కొంగరి సత్య, ఎడ్మల రాజ్యలక్ష్మి, కొంగల జ్యోతి, ఎన్నం మంజుల,సుజాత, కోండ్ర రాంచంద్రారెడ్డి, పెద్ది మహేశ్వర్ రెడ్డి, నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి, లింగారెడ్డి, నాగిరెడ్డి గోపాల్ రెడ్డి, కొంగరి చిన్నారెడ్డి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here