జగిత్యాలలో ఎస్పీ బాలు స్మృత్యాంజలి

0
92

అభి ఈవెంట్స్ ఆధ్వర్యంలో సినీ గీతాల స్వర నీరాజనం

జగిత్యాల తాజా కబురు: పాటల మాంత్రికుడు, పాటే ప్రాణంగా ఉంటూ ఎందరో నూతన గాయకులను తయారు చేసి,తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రపంచమే మెచ్చిన గానగంధర్వుడు, ఎస్పీ బాలు కు జగిత్యాలకు చెందిన అభి ఈవెంట్స్ ఆధ్వర్యంలో గానగంధర్వుండి సంతాప సభను ఈ నెల 16న నిర్వహించనున్నారు. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే.ఎస్పీ బాలు 74సంవత్సరాల వయసులో మృతి చెందగా ఆయన స్మృత్యార్థం జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో శుక్రవారం సాయంత్రం 5గంటలకు 21మంది గాయనీ, గాయకులచే 74 సినీ గీతాలాపన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు, ప్రముఖ గాయకులు అభి తెలిపారు. ఈసందర్భంగా బుధవారం ఈవెంట్స్ కు సంబంధించిన పోస్టర్ ను కళాకారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశ్రీ అధినేత గుండేటి రాజు,సామాజిక వేత్త రేగొండ నరేష్, గాణకోకిల గొల్లపెళ్లి శ్రీరాములు గౌడ్, గాజుల నగేష్, బాస ప్రకాష్, కొమురవెల్లి లక్ష్మీనారాయణ, ఎన్నం కిషన్ రెడ్డి, నృత్య కళాకారులు చిరంజీవి, బొమ్మడి నరేశ్, చాంద్ పాషా, పెండం మహేందర్, ముఖేష్ ఖన్నా, ఠాఖుర్ పవన్ సింగ్, మిష్టర్ తెలంగాణ షావేర్, రాపర్తి రవి, తదితర గాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here