జగిత్యాలలో ‘ఆపరేషన్ చబుత్రా’

0
48

జగిత్యాల తాజా కబురు:జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లో అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతూ,అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న యువతే లక్ష్యంగా ‘ఆపరేషన్ చబుత్రా’ పేరుతో జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లో పోలీసులు ఆదివారం రాత్రి ముమ్మర త‌నిఖీలు నిర్వహించారు.యవకులు అర్ధరాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై గుంపులుగా జులాయిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బంది లకు గురిచేస్తూ, మద్యం సేవించి రోడ్లపై ద్విచక్ర వాహనాలతో రాష్ డ్రైవింగ్, హారన్లు కొడుతూ, ప్రధాన కూడళ్ల లలో వాహనాలను నిలిపి గుంపులుగా, అనుమానస్పదంగా తిరుగుతున్న 30 మంది యువకులను అదుపులోకి తీసుకోని, వారి బైక్ లను పోలీసులు సీజ్ చేయడం జరిగింది. పట్టుబడిన యువకుల తల్లితండ్రుకు సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ సింధూ శర్మ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని, ముఖ్యంగా యువకులు తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు.యువత చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉన్నదని, తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం నుండి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించడం జరుగుతుందని అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవరైనా యువకులు రోడ్లపై అనవసరంగా గుంపులుగా సంచరిస్తూ సామాన్య ప్రజానీకానికి,మహిళలను ఇబ్బందులకు, అభద్రత భావానికి గురి చేస్తే వారిపై టౌన్ న్యూసెన్స్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామన్నారు.యువత చట్టవ్యతిరేకమైన పనుల్లో పాల్గొంటే వారి యొక్క మంచి భవిష్యత్ ను కోల్పోతారని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here