ఛలో సర్పంచ్ గల్ఫ్ భరోసా దీక్ష

0
192

మెట్పల్లి, రాయికల్ తాజా కబురు: ఛలో సర్పంచ్ గల్ఫ్ భరోసా దీక్ష లో భాగంగా గల్ఫ్ జాయింట్ ఆక్షన్ కమిటీ పిలుపు మేరకు జగ్గాసాగర్ గ్రామ సర్పంచ్ బద్దం సుగుణ, ఇటిక్యాల సర్పంచ్ సామల్ల లావణ్య లకు గల్ఫ్ కార్మికుల గోసలు కలెక్టర్ కు వివరించి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని సోమవారం గల్ఫ్ఉద్యమ సమితి జగ్గాసాగర్ గల్ఫ్ కార్మికులు, దుబాయ్ ఎల్లలా శ్రీనన్న సేన తరుపున వినతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కరోన నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికులు గత 3 నెలల నుండి పనులు లేక , జీతాలు లేక తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కేంద్రం అనుమతించిన ప్రత్యేక విమానాల్లో వేల మంది స్వదేశానికి తిరిగి రావడానికి సిద్దంగా ఉన్నారు. అసలే పనిలేక,జీతాలు లేని కార్మికులకు విమాన ఖర్చులు కేంద్రం,క్వారంటైన్ ఖర్చులు తెలంగాణ ప్రభుత్వం భరించాలని, డిమాండ్ చేస్తూ గల్ఫ్ కార్మికులు అట్టి ఖర్చులు భరించే పరిస్తితుల్లొ లేరని,అప్పులతోనె గల్ఫ్ వెళ్ళి,కరోన ప్రభావంతో తిరిగి రావడానికి అప్పులు చెసే పరిస్తితి నెలకొన్న ఈ విపత్కర పరిస్థితుల్లో మానవత దృక్పథంతో ఖర్చు భరించి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తమ సమస్యలు తీసుకుపోయె విధముగా ప్రయత్నం చేయాలని గల్ఫ్ఉద్యమ సమితి జగ్గాసాగర్ గల్ఫ్ కార్మికులు, దుబాయ్ ఎల్లలా శ్రీనన్న సేన తరుపున ఆయా సర్పంచులకు వినతి పాత్రలను అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here